Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జైల్లో చలివేస్తోందన్న లాలూ.. తబలా వాయించుకోండన్న జడ్జ్

Posted 16 days ago | Category : national

పశు దాణా కేసులో దోషిగా రుజువైన బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను దాణా కుంభకోణం కేసులో రాంచీ సీబీఐ కోర్టు దోషిగా పేర్కొన్న విషయం తెలిసిందే.

ఈ కేసులో దోషిగా తేలిన లాలూకి న్యాయస్థానం ఇంకా శిక్ష ఖరారు చేయలేదు. ప్రస్తుతం ఆయన రాంచీ జైళ్లో ఉంటున్నారు. జైళ్లో తనకు బాగా చలివేస్తోందని చమత్కరించిన లాలూకు న్యాయమూర్తి తనదైన శైలిలో బదులిచ్చారు. చలివేస్తే తబలా వాయించుకోండని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి శివపాల్‌సింగ్‌ చమత్కరించారు.

లాలూ రికార్డు మొత్తాన్ని తాను పరిశీలించాననీ, నిఘా పక్కాగా ఉన్నట్లయితే ఈ కుంభకోణం చోటు చేసుకునే ఉండేది కాదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. తాను న్యాయవిద్యను కూడా అభ్యసించానని లాలూ ఈ సందర్భంగా వెల్లడించారు.

వాస్తవానికి లాలూ సహా ఇతర దోషులకు 3వ తేదీన శిక్షలను ఖరారు చేయాల్సి వుండగా, అది వాయిదా పడుతూ వచ్చింది. అయితే దీన్ని శుక్రవారానికి వాయిదా వేశారు. విచారణ తర్వాత అక్కడ నుంచి తనను జైలుకు తరలించబోతున్న సమయంలో న్యాయమూర్తిని ఉద్దేశించి లాలూ మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఆలోచించండని కోరారు. శుక్రవారం నాటి విచారణకు వ్యక్తిగతంగా హాజరయ్యే బదులు వీడియో కాన్ఫరెన్స్‌ను ఎంచుకోవచ్చని న్యాయమూర్తి సూచించారు. అంతేకాదు లాలూ మద్దతుదారుల నుంచి తనకు కాల్స్‌ వస్తున్నాయని తెలియజేశారు. కానీ వివరాలను మాత్రం వెల్లడించలేదు.


స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 12 hours ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 13 hours ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted a day ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 3 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 4 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 5 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 5 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 6 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 7 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !

ఆ జైలు నాకిష్టం లేదు : లాలూ

Posted 9 days ago | Category : national

ఆ జైలు నాకిష్టం లేదు : లాలూ

సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి

Posted 9 days ago | Category : national

సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి