//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎన్టీఆర్ బయోపిక్ రేంజ్ బిజినెస్ ఇదేనా ....కారణం జూ.ఎన్టీఆర్ ...!

Category : movies

ఆరడుగుల అందగాడు , ఆంధ్రుల ఆరాధ్య దైవం , లెజండ్రీ యాక్టర్ , రెండు రూపాయలకే రేషన్ బియ్యం ఇచ్చిన మహానుభావుడు , మద్యపాన నిషేధం చేసి ఆంధ్ర ఆడబిడ్డల మన్నలను పొందిన మహనీయుడు, మాజీ సీఎం శ్రీ నందమూరి తారక రామారావు. అటువంటి మహనీయుడి ఘన చరిత్రని ఇప్పుడు బయోపిక్ రూపం లో మన ముందుకు నందమూరి నట సింహం ఎమ్మెల్యే బాలకృష్ణ తీసుకురాబోతున్నాడు.

ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. ఇందులో బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ పాత్ర లో పరకాయ ప్రవేశం చేసాడు. ఇక పొతే సినిమాలోని కొన్ని కీలకమైన పాత్రలలో టాలీవుడ్ , బాలీవుడ్ కి చెందిన ప్రముఖ నటులు నటిస్తున్నారు. ఇంతమంది ప్రముఖ నటులు ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్న కూడా ఈ సినిమాలో ఎదో ఒక లోపం కనిపిస్తున్నట్టు ఉంది. ఆ లోపం ముఖ్యం గా నందమూరి అభిమానులకి కనిపిస్తుంది . మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే జూ .ఎన్టీఆర్ అభిమానులకి కనిపిస్తుంది.

ఇక అసలు విషయానికొస్తే ఈ సినిమాకి ఎన్టీఆర్ పేరు పెట్టిన కూడా రావాల్సినంత హైప్ అయితే రాలేదు . బిజినెస్ కూడా ఎదో సాధారణ చిత్రంలాగే జరుగుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాకి కేవలం 80 కోట్ల వరకు ఆఫర్ వచ్చినట్టు సమాచారం. కానీ ఆ మహానటుడికి ఈ సంఖ్య చాల చిన్నగా అనిపిస్తుంది . దీనికి ముఖ్య కారణం జూ . ఎన్టీఆర్ అనే తెలుస్తుంది. ఈ సినిమాలో కనీసం ఒక నిముషం నిడివిగల పాత్ర లో నటించింటే బిజినెస్ మరో విధంగా ఉండేదని సినీ అభిమానులు అనుకుంటున్నారు