//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఐతే మరీ ఇంత బోల్డా..?

Category : movies

టాలీవుడ్ లో 2003లో వచ్చిన ఐతే మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కు నేషనల్ అవార్డ్స్ కూడా లభించాయి. ఈ విధం గా ఐతే సినిమా మంచి గుర్తింపు అందుకుంది. ఐతే ఎవరు ఊహించని విధంగా నేషనల్ అవార్డ్ దక్కడంతో సినిమా కథ ఇతర భాషల్లో మంచి రేట్ కు అమ్ముడు పోయింది. ఈ సినిమాను నిర్మాత గుణ్ణం గంగరాజు గారు నిర్మించారు.

ఇప్పుడు ఐతే ని పోలిన సినిమా మరొకటి టాలీవుడ్ లో రూపొందుతుంది. ఈ మూవీ సైలెంట్ గా క్రైమ్ హైజాకింగ్ తరహాలో సాగిపోతుంది. ఈ కథలో కూడా నలుగురు స్నేహితులు ఒక అమ్మాయి ఉన్నట్లు సమాచారం . పాత ఐతే లానే కొత్తగా వస్తోన్న ఐతే 2.0 కాన్సెప్ట్ మాత్రం కొంచెం డిఫెరెంట్ గా ఉంటుంది.

రీసెంట్ గా ఐతే సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. సైబర్ క్రైమ్ నేపథ్యంలో హ్యాకింగ్ చేయడం వంటి అంశాల చుట్టూ కథ నడుస్తుందని తెలుస్తున్నది. అయితే ఈ ఐతే 2.0 తెరకెక్కించిన విధానం మాత్రం కొంచెం కొత్తగా కనిపిస్తున్నది.

నార్త్ సీరియల్ యాక్టర్ ఇంద్రనీల్ సేన్ తప్పితే సినిమాలో అందరు దాదాపు కొత్త వారే. ట్రైలర్ స్పీడ్ చూస్తుంటే సినిమాను ఏ తరహాలో తీశారో అర్థం చేసుకోవచ్చు. రాజ్ మదిరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను హేమంత్, విజయ్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా రిలీజ్ అయితె గాని సినిమా గురించిన పూర్తీ సమాచారం తెలిసేటట్టు లేదు.