//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సీఎం రమేష్ ఇళ్లపై ఐటీ దాడులు..

Category : politics

ప్రముఖ టీడీపీ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయి .హైదరాబాద్, కడపలో ఉన్న ఆయన నివాసాలకు, కంపెనీలకు 60 మంది ఐటీ అధికారులు వచ్చి తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీలలో భాగంగా అయన సోదరుడు, అయన బంధువుల ఇళ్లపై కూడా సోదాలు నిర్యహించారు. ప్రస్తుతం న్యూఢిల్లీలో ఉన్నాడు సీఎం రమేష్.

తరువాత అయన మాట్లాడుతూ తాము పన్నులను సక్రమంగా చెల్లిస్తున్నానని, మా కంపెనీల లావాదేవీలు కూడా సక్రమంగానే ఉన్నాయని అన్నారు. భారతీయ జనతా పార్టీ కుట్రపూరిత రాజకీయాలు చేస్తుందని అయన వాపోయారు.కేంద్ర పీఏసీ సభ్యుడిగా ఉన్నారు సీఎం రమేష్. అయితే దేశంలో ఐటీ దాడులు ఎక్కడ జరుగుతున్నాయి? ఏపీలో జరుగుతున్న దాడుల వివరాలు తెలియజేయాలంటూ, ఆదాయపు పన్ను శాఖకు ఇటీవల ఆయన నోటీసులు పంపించారు సీఎం రమేష్.

ఆలా అడిగిన మూడు రోజులకె రమేష్‌ ఆస్తులపై దాడులు జరగడం చూస్టునంటే కేంద్రం కక్ష సాధింపు చర్యే అనిపిస్తుంది.కాగా, సీఎం రమేష్ ఇళ్లు, కార్యాలయాల్లో దాడులు చేస్తున్న అధికారులు, ఆస్తుల పత్రాలను, ఇతర డాక్యుమెంట్లను, ఆయన నిర్వహిస్తున్న పలు కాంట్రాక్టులకు చెందిన దస్త్రాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

Related News