//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

22 ప్రాంతాల్లో లాలూ బినామీ భూ దందాపై ఐటి దాడులు

Category : national politics

రాష్ట్రీయ జ‌న‌తాద‌ళ్(ఆర్జేడీ) అధినేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ఇండ్ల‌పై ఆదాయ‌ప‌న్నుశాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. ఢిల్లీతో స‌హా మొత్తం 22 ప్రాంతాల్లో ఈ దాడులు జ‌రుగుతున్నాయి. వంద కోట్ల రూపాయల బినామీ భూ దందాకు సంబంధించిన కేసులో ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు ఈ దాడులు నిర్వ‌హిస్తున్నారు. 

ఆర్జేడీ ఎంపీ పీసీ గుప్తా తనయుడితో పాటు ఇత‌ర వ్యాపార‌వేత్త‌ల‌ ఇండ్లలో కూడా సోదాలు జ‌రుగుతున్నాయి. భూ దందాకు సంబంధం ఉన్న లాలూ కుటుంబ‌స‌భ్యుల ఇండ్ల‌ల్లోనూ సోదాలు నిర్వ‌హిస్తున్నారు. దాదాపు వెయ్యి కోట్ల విలువైన ఆస్తులు లాలూ కుటుంబీకుల పేరున ఉన్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వారంతా ఆదాయంప‌న్ను కూడా ఎగ్గొట్టార‌న్న విమ‌ర్శ‌లు వస్తున్నాయి. 

ఆదాయ‌ప‌న్ను శాఖ‌కు చెందిన సుమారు వంద మంది అధికారులు, పోలీసులు సోదాల్లో పాల్గొన్నార‌ని అధికారులు చెప్పారు. లాలూతో పాటు ఆయ‌న కుమార్తె మిశా భార‌తి, ఇద్ద‌రు కుమారులు అక్ర‌మంగా భూ ఒప్పందాలు కుద‌ర్చుకున్న‌ట్లు బీజేపీ ఇటీవ‌ల ఆరోప‌ణ‌లు చేసింది. ఆ అంశంలో విచార‌ణ చేప‌ట్టాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఆ పార్టీ కోరింది. 

లాలూ రైల్వే మంత్రిగా ఉన్న‌ప్పుడు ఈ కేసులు న‌మోదు అయ్యాయ‌ని కేంద్ర మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ అన్నారు. క్విడ్ ప్రోకో కేసులో లాలూపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కూడా బీహార్ సీఎం నితీశ్‌ను డిమాండ్ చేశారు .