//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దక్షిణాదిలోనే ఐటి దాడులు... రాజకీయ ప్రేరేపితమా ?

Category : national business

నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఆదాయ పన్ను శాఖ జరుపుతున్న దాడులు బిజెపి అధికారంలో లేని దక్షిణాది రాస్త్రాలలోనే ఎక్కువగా జరుపుతూ ఉండటం, ఆ పార్టీ అధికారంలో ఉన్న ముంబయి, అహ్మదాబాద్ వంటి భారీ వ్యాపారాలు జరిగే నగరాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపక పోవడం విస్మయం కలిగిస్తున్నది. చివరకు దేశ రాజధాని ఢిల్లీ లో కూడా అంతంత మాత్రంగానే దాడులు జరుగుతున్నాయి. 

ఐటి దాడులు ఎక్కువగా బిజెపియేతర పక్షాలకు చెందిన నాయకులు, వారికి సంబంధించిన కంపెనీలు, లేదా వారితో సంబంధం గల కంపెనీలపైననే జరుగుతూ ఉండడంతో రాజకీయ ప్రేరేపితంగానే జరుగుతున్నట్లు భావించ వలసి వస్తున్నది. దక్షిణాది రాష్ట్రాలలో పాగా వేయడం కోసం బిజెపి చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఇటువంటి దాడులు జరుగుతున్నాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 

ఒక ఆంగ్ల పత్రిక కధనం ప్రకారం ఎక్కువగా ఐటి దాడులు జరిపిన 14 నగరాలలో బెంగుళూరు,  చెన్నై, హైదరాబాద్, కొచ్చి లు ముందంజలో ఉన్నాయి. 2016లో బెంగుళూరు లో 25 దాడులు జరిపి రూ 64.84 కోట్లు స్వాధీనం చేసుకొన్నారు. లెక్కకు రాని  రూ 1854.45 కోట్ల ఆదాయాన్ని కనుగొన్నారు. అట్లాగే 2017లో 72 దాడులు జరిపి రూ 131.82 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. లెక్కకు రాని రూ 4590.92 కోట్లు కనుగొన్నారు. 

కానీ దేశ ఆర్ధిక రాజధాని ముంబయి లో 2016లో 30 దాడులు మాత్రమే జరిపి రూ 35.27 కోట్లు స్వాధీనం చేసుకోగా, రూ 1,726 కోట్ల లెక్కకురాని మొత్తం కనుగొన్నారు. 2017లో 54 దాడులు జరిపి రూ 115.09 కోట్లు స్వాధీనం చేసుకొని, రూ 20.76 కోట్ల లెక్కకు రాని మొత్తం కనుగొన్నారు. 

ఇక దేశ రాజధాని ఢిల్లీలో 2016లో 32 దాడులు జరిపి రూ 41.54 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. రూ 147.57 కోట్ల లెక్కలు రాని మొత్తం స్వాధీనం చేసుకున్నారు. 2017లో 84 దాడులు జరిపి రూ 173.41 కోట్లు స్వాధీనం చేసుకొని, రూ 72749 కోట్ల లెక్కకు రాని మొత్తాలు గుర్తించారు.