//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కే. జీ. ఎఫ్ హీరో యశ్ పై ఐటీ దాడులు...!

Category : movies

కన్నడ చిత్ర పరిశ్రమకే తలమానికమైన కే. జీ. ఎఫ్ సినిమాలో హీరోగా నటించి యావత్ భారతీయ చిత్ర పరిశ్రమకే ఘనత తీసుకొచ్చే విధమైన నటనతో అలరించిన రాకింగ్ స్టార్ యాష్ పై ఐటీ దాడులు నిర్వహించారు అధికారులు. అలాగే ఈ చిత్ర నిర్మాతలపై కూడా ఐటీ దాడుల నిర్వహించినట్టు అనంతరం విచారణ కు ఆదేశించినట్టు తెలుస్తుంది. హీరో యశ్‌ తన తల్లి పుష్పతో కలిసి క్వీన్స్‌ రోడ్డులో ఉన్న ఆదాయ పన్ను శాఖ వద్దకు వచ్చారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన యశ్‌ మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఐటీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానం చెప్పినట్టు ఆయన పేర్కొన్నారు.

తాను నటించిన రీసెంట్ సూపర్ హిట్ కే. జీ.ఎఫ్. చిత్రానికి గాను ఆయన 50 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నట్టు వస్తున్న వార్తలను యశ్ ఖండించారు. ప్రస్తుత తన ఆదాయ వనరుల పై ఐటీ అధికారులు విచరించినట్టు దానికి ఆయన సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది.అలాగే తన సంస్థలో పనిచేస్తున్న వారి గురించి అడిగారని, తన ఆడిటర్‌ ఇంటిపై ఎలాంటి ఐటీ దాడి జరగలేదనీ చెప్పారు. తనను వేధించటానికి ఇలా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇకపై ఇలాంటివి జరిగితే ఆయన సహించనన్నారు. కొన్ని చానళ్లు తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే యశ్ పేరు దేశమంతా వినిపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటన ఆయనను తీవ్రంగా కలచివేసింది అని తెలుస్తుంది.

Related News