భారీ ఐటీ పరిశ్రమ ‘స్టేట్ స్ర్టీట్ హెచ్సీఎల్ సర్వీసెస్’ సంస్థ కేసరపల్లిలోని ఏస్ అర్బన్- ఏపీఐఐసీ హైటెక్ సిటీలోని ‘మేథ’ టవర్లో గురువారం ప్రారంభమయింది. దీంతో భారీ ఐటీ కేంద్రంగా బెజవాడ వృద్ధి చెందటానికి మార్గం సుగమం అయింది. రాష్ట్ర ప్రభుత్వం చొరవ, హెచ్సీఎల్ టెక్నాలజీస్ సంస్థ సహకారంతో దాని భాగస్వామ్య సంస్థ ‘మేథ’ లో కొలువు తీరటంతో ఏపీ కి బిగ్ ఐటీ ఇండస్ర్టీ లేని లోటు తీరింది.
వినాయక చవితి పర్వదినాన రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ అట్టహాసంగా ఈ బిగ్ ఐటీ కంపెనీని ప్రారంభించారు.రాజధాని ప్రాంతం విజయవాడకు అను బంధంగా ‘సైబర్వాడ’గా అభివృద్ధి చెందుతున్న కేసరపల్లిలో ‘స్టేట్ స్ర్టీట్ హెచ్సీఎల్ సర్వీసెస్’ సంస్థ ప్రారంభంతో భవిష్యత్తులో ఐటీరంగం మహా విస్తరణకు బీజం పడింది. విదేశాలలో మనీలాతోపాటు మన దేశంలో కోయం బత్తూరు, చెన్నై నగరాలలో ఈ సంస్థ కార్యకలాపాలను ప్రారంభించింది.
అర్థ దశాబ్ద కాలానికి పైగా ఈ సంస్థ అభివృద్ధి చెందుతూ వస్తోంది. ఈ కంపెనీ ప్రస్తుతం నాలుగు వేల మంది ఉద్యోగులను కలిగి ఉంది. కేసరపల్లిలోని హైటెక్ సిటీలో మేథ టవర్లో భారీ విస్తీర్ణంలో నెలకొల్పిన అతి భారీ ఐటీ కంపెనీ కూడా ఇదే కావటం గమ నార్హం.
ఇప్పటి వర కు ‘మేథ’ టవర్లో చిన్న, మధ్య తరహా ఐటీ కంపెనీలు మాత్రమే ఉన్నాయి. ఒక్కో కంపెనీ 100 నుంచి 200 సంఖ్యలోపల ఉద్యోగులను తీసుకుంది. గతంలో ఇక్కడ ఒకటి, రెండు చిన్న ఐటీ కంపెనీలు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం ప్రభుత్వం కృషి వల్ల మేథ టవర్లోకి అనేక ఐటీ కంపెనీలు కొలువు తీరాయి. పెద్ద ఐటీ పరిశ్రమ వస్తే ఐటీ రంగం విస్తరణకు అవకాశం ఏర్పడుతుందని భావిస్తున్న దశలో ప్రపంచ స్థాయి స్టేట్ స్ర్టీట్ ఏర్పడింది. ఒకేసారి వెయ్యి మందికి ఉద్యోగావకాశాలు కల్పించటంతోపాటు భారీ వేతనాలు కూడా అందుకునే అవకాశం ఉంది.
#AP #Naralokesh #Apitminister #Bigitcompany