Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టైమ్‌ మెషీన్‌ సాధ్యమేనట...!

Category : world

గతంలోకి మరియు భవిష్యత్తులోకి వెళ్లిరావటాని ఉద్దేశించిన టైమ్‌ మెషీన్‌ ను తయారుచేయడం సాధ్యమేనని శాస్త్రవేత్త బెన్‌టిప్పెట్‌ అన్నారు. 1895 లో హెచ్‌.జి.వెల్స్‌ రచించిన టైమ్‌ మెషీన్‌ అప్పట్లో సంచలనం. నాటి నుండి ఇప్పటివరకు పలువురు ఇది సాధ్యమేనని, మరికొందరు ఇది సాధ్యంకాదని అంటున్నారు. తాజాగా బ్రిటిష్‌ కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన బెన్‌టిప్పెట్‌ అనే శాస్త్రవేత్త ఇది సాధ్యమేనని చెబుతున్నారు. గణితం, భౌతికశాస్త్రాల ఆధారంగా ‘టైమ్‌ మెషీన్‌’ సాకరమయ్యే గణితశాస్త్ర నమూనాను ఆయన అభివృద్ధి చేశారు. ‘గతం, భవిష్యత్తులోకి ప్రయాణించడాన్ని ప్రజలు కేవలం కల్పితంగా భావిస్తున్నారు. మేం కూడా దీన్ని సాధ్యం కాదని భావిస్తున్నాం. ఎందుకంటే దీన్ని ప్రస్తుతానికి తయారు చేయలేం. అది తయారుచేయడానికి కావాల్సిన వస్తు, సామగ్రి మన దగ్గర లేదు. గణితశాస్త్ర ప్రకారం టైమ్‌ మెషీన్‌ను తయారు చేయడం సాధ్యమే’ అని టిప్పెట్‌ పేర్కొన్నారు.

Related News