//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఫిబ్రవరి 6వతేదీలోగా ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవడం తప్పనిసరి

Category : national

వచ్చే ఏడాది ఫిబ్రవరి 6వతేదీలోగా మొబైల్ ఫోన్ నంబరును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవడం తప్పనిసరి అని కేంద్రం మరో సారి స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించిన 113 పేజీల అఫిడవిట్‌లో పేర్కొంది. కొత్తగా బ్యాంకు ఖాతా ప్రారంభించడానికి ఆధార్ కార్డు తప్పని సరి అని కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే ఉన్న బ్యాంకు ఖాతాలకు ఆధార్ నంబరును వచ్చే ఏడాది మార్చి 31లోగా అనుసంధానం చేసుకునేలా గడవును కేంద్రం పెంచింది. మార్చి 31లోగా బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేయకుంటే ఖాతాలను నిలిపివేస్తామని కేంద్రం స్పష్టం చేసింది.