//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

డేటా చోరీ కేసులో నా పేరు తొలగించండి .. స్క్వాష్ పిటీషన్ వేసిన ఐటీ గ్రిడ్ సిఈఓ అశోక్

Category : state

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డేటా చోరీ కేసులో షాకింగ్ ట్విస్ట్ నెలకొంది. నిన్నటి వరకు ఎక్కడ ఉన్నాడో తెలియని అశోక్ తనకు ఈ కేసుతో సంబంధం లేదని హైకోర్టును ఆశ్రయించారు. ఐటీ గ్రిడ్ సీఈవో అశోక్ ను పట్టుకోవడం కోసం తెలంగాణ పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేస్తుంటే, అశోక్ మాత్రం తనను కావాలనే కేసులో ఇరికించి ప్రయత్నం చేస్తున్నారని కోర్టును ఆశ్రయించారు.

దీంతో తెలుగురాష్ట్రాల మధ్య రాజకీయ దుమారం రేపుతున్న డేటా చోరీ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. డేటా చోరీ కేసులో కీలకమైన ఐటీ గ్రిడ్ సంస్థ సిఈవో ఐటీ గ్రీడ్ కేసులో తన పేరును అనవసరంగా ఇరికించారని ఆరోపించారు. తన పేరు తొలగించాలని హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ వేశారు. ఐటీ గ్రిడ్ కు సంబంధించి కేసులో తన పేరును పోలీసులు అనవసరంగా ఇరికించారని తన పేరు తొలగించాలని కోరారు.

అశోక్ పిటీషన్ పై శనివారం తెలంగాణ హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే ఐటీ గ్రిడ్ సంస్థలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ సోదాలు నిర్వహించింది. హార్డ్ డిస్క్ లు, కంప్యూటర్లతోపాటు కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకుంది సిట్ బృందం. అనంతరం ఆ కార్యాలయాన్ని సీజ్ చేసింది. మొత్తంగా అశోక్ వేసిన పిటిషన్ తో ఈరోజు దీనిపైన కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.

Related News