Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అమితాబ్ పై ఐటి కన్ను.. పనామా పత్రాలపై దర్యాప్తు !

Posted 5 months ago | Category : national

పనామా పత్రాలలో పేరు రావడంతో పాకిస్తాన్ ప్రధాని పదవిని నవాజ్ షరీఫ్ కోల్పోవడంతో భారత ప్రభుత్వంపై వత్తిడి పెరుగుతున్నది. ఈ పత్రాలలో వెలుగులోకి వచ్చిన ప్రముఖులపై దర్యాప్తు ముందుకు సాగక పోవడం పట్ల విమర్శలు తలెత్తుతున్నాయి. దానితో ఆదాయపన్ను విభాగం ఈ పత్రాలపై దర్యాప్తును ముమ్మరం చేస్తున్నది. 

దానితో ఈ పత్రాలలో పేర్లు ఉంటున్నట్లు భావిస్తున్న బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఇతరులపై దర్యాప్తు వేగం పుంజుకున్నట్లు తెలుస్తున్నది. దానితో బిగ్ బి మరోసారి ప్రమాదంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. పనామా పాత్రల దర్యాప్తును తాము నీరుగార్చలేదని, విదేశాలలో తగు ఆధారాలు సేకరించడం కోసం విస్తృతంగా ప్రయత్నం చేస్తున్నామని ఉన్నత అధికారి ఒకరు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 

ఈ పత్రాలకు సంబంధించిన సమాచారం సేకరించడం కోసం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుకు చెందిన సీనియర్ అధికారి  ఒకరిని బ్రిటిష్ వర్జిన్ దీవులకు పంపిన్నట్లు తెలుస్తున్నది.  కరీబియన్ లో గల ఈ దీవి పలు `పన్ను స్వర్గాలు' లో ఒకటిగా భావిస్తుంటారు. పనామా పత్రాలలో వెలుగులోకి వెచ్చిన 33 మందికి సంబంధించి ఐటి విభాగం దర్యాప్తు చేపట్టింది. 

పనామా పత్రాలలో పేర్కొన్న సంస్థలు వీటితో తనకు సంబంధం లేదని బచ్చన్ గతంలో చెప్పి ఉండడంతో, ఆయా సంస్థల మూలాల గురించిన వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా బచ్చన్ కు వాటితో గల సంబంధాన్ని వెల్లడి చేస్తే గాని ఆయనపై కేసు నమోదు చేయడం సాధ్యం కాదని చెబుతున్నారు.

పనామా పత్రాలలో బచ్చన్ తో పాటు పలువురు సినీ నటులు, రాజకీయ నాయకులు, వ్యాపార ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. అయితే విదేశాలలో తమ ఆర్ధిక  కలాపాలు అన్ని భారత దేశ నిబంధనలకు లోబడే ఉన్నట్లు అమితాబ్ గతంలో స్పష్టం చేశారు. పనామా పత్రాలతో పేర్కొన్న కంపెనీ లతో తనకు ఎటువంటి సంబంధం లేదని ఖండించారు. 

అయితే ఈ పత్రాలలో పేర్కొన్న   కొన్ని వివరాలు వాస్తవమైనవని, వాటికి సంబంధించిన వివరాలు సేకరించడం వ్యవధితో కూడుకున్న అంశమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. పనామా పత్రాలు పనామాలో గల ఒక లా ఫర్మ్ నుండి లీక్ అయ్యాయి. వీటిల్లో 35 దేశాలకు చెందిన 2.14 లక్షల కంపెనీలకు చెందిన 1.15 కోట్ల పత్రాలు ఉన్నాయి. ఇవి 1977 నుండి 2015 వరకు సంబంధించినవి. 

ఈ పత్రాలలో 50 దేశాలకు చెందిన 140 మంది రాజకీయ ప్రముఖుల పేర్లు ఉన్నాయి. వారిలో ప్రస్తుత లేదా మాజీ దేశాధినేతలు 12 మంది ఉన్నారు. ఫోర్బ్స్ జాబితాలో పేర్కొన్న 29 మంది కోటీశ్వరులు కూడా ఉన్నారు. పనామా పత్రాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం కోసం ఏర్పాటైన గ్లోబల్ టాస్క్ ఫోర్స్ లో భారత్ కూడా భాగస్వామి. 


మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted 3 hours ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted a day ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 5 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే