అమెరికా కేంద్ర స్థానంగా ఐటీ సేవలు అందిస్తున్న హెచ్‌టీసీ గ్లోబల్ సర్వీసెస్..వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి సైబర్ ఇండస్ట్రీస్‌ను కొనుగోలు చేసింది. ఒప్పందం విలువ 93 మిలియన్ డాలర్లని కంపెనీ సీఈవో, ప్రెసిడెంట్ మాధవ రెడ్డి చెప్పారు. దీంతో కంపెనీ ఆదాయం 300 మిలియన్ డాలర్ల నుంచి 600 మిలియన్ డాలర్లకు చేరుకుందని, అలాగే ఉద్యోగుల సంఖ్య కూడా 11 వేలకు చేరుకున్నట్లు ఆయన వెల్లడించారు. 2020 నాటికి బిలియన్ డాలర్ల సంస్థగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం సంస్థ హైదరాబాద్‌తోపాటు చెన్నైలో డెలివరీ సెంటర్లను ఏర్పాటు చేసింది.
హైదరాబాద్ సెంటర్లో 500 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, వచ్చే నాలుగేండ్లలో ఈ సంఖ్యను రెట్టింపు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. 2020 నాటికి అంతర్జాతీయంగా మరో 5 వేల మంది సిబ్బందిని నియమించుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. కంపెనీకి బీమా, ఆటో, హెల్త్‌కేర్ విభాగాల నుంచి అధిక ఆదాయం సమకూరుతుందన్నారు.