IT డిపార్ట్మెంట్ 60,000 మంది ఖాతాదారులపై "ఆపరేషన్ క్లీన్ మనీ II " ను అమలు చేయనుంది. నోట్ల రద్దు అనంతరం జరిగిన లావాదేవీలపై విచారణ జరగనుంది. నోట్ల రద్దు సమయంలో ఎక్కువ సేల్స్ జరిపినట్టుగా వీరు లెక్కలు చూపించినట్లు తేలింది. 6000 లావాదేవీలలో అత్యంత ఖరీదైన కొనుగోళ్లు జరిగినట్లు తెలిసింది. ఒక 6,600 కేసుల్లో దేశం బయటకు డబ్బు పంపటం జరిగింది. తప్పు చేసిన వారికి ముందు నోటీసులు పంపిస్తామని, జవాబివ్వకపోతే ఎంక్యయిరీ చేస్తామని అధికారులు తెలిపారు.