//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చంద్రబాబు సభలో కలకలం

Category : politics

ధర్మవరంలో సీఎం చంద్రబాబు పర్యటనలో ఆసక్తికరమైన సంఘటన జరిగింది.

తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండైన టీడీపీ నేత చంద్రబాబు సభలో ప్రత్యక్షం కావడం పార్టీ నేతలని అయోమయంలో పడేసింది. అనంతపురం జిల్లా ధర్మవరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన జన్మభూమి-మా ఊరు ముగింపు సభకు ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి హాజరయ్యారు. తన మామ దివాకర్ రెడ్డితో కలసి ఆయన ఈ కార్యక్రమానికి వచ్చేశారు. అంతేకాదు, వేదికపై ఆశీనులయ్యారు.

హైదరాబాద్ లో భూకబ్జా కేసు నేపథ్యంలో, ఆయనను గత ఏడాది జూన్ లో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతన్ని టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో, సీఎం సభకు ఆయన హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది.

దీపక్‌రెడ్డిపై గతంలో పలు కేసులు నమోదయ్యాయి. బెదిరింపులు, దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ సెక‌్షన్‌ 506 కింద రెండు కేసులు, ఆక్రమణలకు పాల్పడ్డారంటూ సెక‌్షన్‌447 కింద కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. కొందరిపై దాడి చేశారని సెక‌్షన్‌ 341 కింద ఓ కేసు, మారణాయుధాలు కలిగి ఉన్నాడని సెక‌్షన్‌ 148 కింద మరో కేసు నమోదైనట్లు సమాచారం. ఇవి కాకుండా భూకబ్జాలకు సంబంధించి హైదరాబాద్‌లో 6 కేసులు నమోదయ్యాయి. మాదాపూర్‌ పోలీసుస్టేషన్‌లో బెదిరింపుల కేసు, సైఫాబాద్‌ పోలీసుస్టేషన్‌లో ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్‌ను బెదిరించిన కేసులు కూడా ఆయనపై ఉన్నాయి.