//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

PSLV-C42 రాకెట్ ప్రయోగం విజయవంతం

Category : national state

పీఎస్‌ఎల్వీ-సీ42 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. బ్రిటన్‌కు చెందిన నోవాసర్, ఎస్‌1-4 ఉపగ్రహాలను ఇస్రో అధికారులు అంతరిక్షంలోకి పంపారు.

ఈ రెండు ప్రయోగాలు భూమిని పరిశీలించనున్నాయి. ప్రయోగం విజయవంతంకావడంతో శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మన్ శివన్ అభినందించారు.

కాగా ఈ రాకెట్‌ 17.44 నిమిషాలకు 583 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. భూమధ్యరేఖకు 97.80 డిగ్రీల వాలులో 140 డిగ్రీల దిగాంశంపై సూర్యసమస్థితి కక్ష్యలో 483 కిలోల నోవాసర్‌ ఎస్‌, 444 కిలోల ఎస్‌1-4 ఉపగ్రహాలను విడిచిపెట్టింది.

ఇప్పటి వరకు 243 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపారు. షార్‌లోని ప్రథమ ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీని నింగిలోకి పంపడం ఇది 33 వసారి.

Related News