//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఇస్రోతో జీశాట్-6ఏ కనెక్షన్ కట్...!

Category : national

రెండు రోజుల ముందు భారత్ విజయవంతంగా ప్రయోగించిన కొత్త ఉపగ్రహం జీశాట్-6ఏ తో సంబంధాలు కోల్పోయినట్లు ఇస్రో అధికారులు తెలిపారు . శాటిలైట్ నుంచి ఎలాంటి సమాచారం అందడం లేదని వారు అన్నారు.

ఆ ఉపగ్రహంతో అనుసంధానం కావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు తెలిపారు. ఈ ఉపగ్రహానికి సంబంధించి చివరిదైన మూడో లామ్ ఇంజిన్‌ను మండించినప్పటి నుంచి దానితో అనుసంధానం కోల్పోయామని ఇస్రో తన అధికారిక వెబ్‌సైటులో పేర్కొంది.

చివరి సారిగా మార్చి 30న ఉదయం 9.22 గంటలకు దాని నుంచి సమాచారం అందిందని తెలిపింది. మొదటిసారి కక్ష్య పెంపు ప్రక్రియ చేపట్టిన సమయంలో అది సమాచారాన్ని చేరవేసిందని పేర్కొంది. మార్చి 31న రెండోసారి కక్ష్య పెంపు ప్రక్రియను చేపట్టినట్లు తెలిపింది. జీశాట్-6ఏ ఉపగ్రహాన్ని గురువారం విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే.