Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమైన ‘ఇస్మార్ట్ శంకర్’ !

Category : movies

పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో- హీరో రామ్, నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్ హీరోయిన్లుగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనెర్ చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడదలకు సిద్ధమైంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని జూలై 18న గ్రాండ్ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ద‌ర్శ‌క నిర్మాత‌లు తెలిపారు.ఈ చిత్రానికి మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందించగా,

అందులో నాలుగు పాటలు విడుద‌లై ఇప్పటికే అమేజింగ్ రెస్పాన్స్ తేచుకున్నాయి. ఈ సినిమాలో రామ్‌ తన నటనతోనే కాకుండా సరికొత్త లుక్‌ లో కనపింబోతున్నారు. ప్రేక్షకులకు ఈ సినిమా పై భారీ అంచ‌నాలున్నాయి. రాజ్ తోట ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. రీసెంట్‌ గా విడుద‌లైన టీజ‌ర్‌ కు, దిమాక్ ఖ‌రాబ్ అనే సాంగ్‌ కు ప్రేక్ష‌కుల నుండి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కలసి పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ ఫై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.