ఇషాంత్‌శర్మ గురించి తెలియని భారత క్రికెట్ అభిమానులు ఉండరు. ఈ ఫాస్ట్ బౌలర్ తన బౌలింగ్ తో ఇండియాకు విజయాలను అందిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకున్నాడు. కానీ కొంతకాలంగా పామ్ కోల్పయి పడుతున్నాడు. ఈ సారి ఐపీఎల్ కి రూ.2 కోట్ల కనీస ధరతో వేలానికి వచ్చిన ఇషాంత్‌ను ఏ ఫ్రాంఛైజీ అతణ్ని తీసుకోలేదు. కానీ ఇప్పుడు అదృష్టం అంటే ఇషాంత్శర్మదే. ఈసారి వేలంలో అమ్ముడుపోని ఈ సీనియర్ పేసర్‌కు ఐపీఎల్లో ఆడే అవకాశం వచ్చింది. దానికి కారణం వీరేంద్ర సెహ్వాగే! పంజాబ్‌కు మార్గనిర్దేశకుడిగా ఉన్న వీరూ ఇషాంత్‌కు ఐపీఎల్ ఆడే అవకాశాన్ని కల్పించాడు. ఈ విషయాన్ని ఇషాంతే చెప్పాడు. ‘‘రెండు రోజుల క్రితం వీరూ భాయ్ నుంచి ఫోన్ వచ్చింది. నువ్వు ప్రస్తుతం ఖాళీగా ఉన్నావా అని అడిగాడు. కౌంటీ క్రికెట్ ఆడాలనే ప్రణాళికలో ఉన్నా అని చెప్పా. అప్పుడే పంజాబ్ జట్టుకు ఆడతావా అని అడిగాడు. సరే అన్నా’’ అని ఇషాంత్ చెప్పాడు. మురళీ విజయ్ గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరం కావడంతో అతనికి ఈ అవకాశం వచ్చింది. గత సీజన్లో ఇషాంత్ రైజింగ్ పుణెకు ఆడాడు.