//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మీ పాన్ కార్డు చెల్లుతుందా ?

Category : national

ఆదాయపన్ను శాఖ ఈ మ‌ధ్యే మొత్తం 11.44 ల‌క్ష‌ల పాన్ కార్డుల‌ను బ్లాక్ చేసింది. న‌కిలీ లేదా ఒక్క‌రికే ఒక‌టి క‌న్నా ఎక్కువ పాన్ కార్డులు ఉన్న‌వాటిని ఐటీ శాఖ తొల‌గించింది. త‌ప్పుడు ప‌త్రాలు ఇచ్చి పాన్ కార్డులు పొందిన వారి వివ‌రాల‌ను కూడా ప్ర‌భుత్వం గుర్తించింది.

ఇలాంటి ప‌రిస్థితుల్లో మీ పాన్ కార్డ్ వాలిడిటీ తెలుసుకోవాలంటే ఆదాయపన్ను ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌కు వెళ్లండి.  హోమ్ పేజ్‌లో `నో యువ‌ర్ పాన్‌'పై క్లిక్ చేయండి. ఆ పేజ్‌లో మీ ఇంటిపేరు, పేరు, పాన్ స్టేట‌స్‌, జెండ‌ర్‌, డేట్ ఆఫ్ బ‌ర్త్‌, పాన్ కార్డు పొంద‌డానికి ఇచ్చిన మొబైల్ నంబ‌ర్ వివ‌రాల‌ను అడుగుతుంది.

త‌ర్వాత రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబ‌ర్‌కు ఓటీపీ వ‌స్తుంది. దానిని వాటిడేట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ పాన్ కార్డ్ చెల్లితే యాక్టివ్ అన్న మెసేజ్ వ‌స్తుంది. ఒక‌వేళ ఇవే వివ‌రాల‌తో ఒక‌టి క‌న్నా ఎక్కువ పాన్ నంబ‌ర్లు ఉంటే సైట్ మిమ్మ‌ల్ని అల‌ర్ట్ చేస్తుంది. అప్పుడు మరిన్ని వివ‌రాలు ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ మ‌ధ్యే పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాల‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టంచేసిన విష‌యం తెలిసిందే. ఈ నెల 31 వ‌ర‌కు గ‌డువు ఇచ్చింది. ఒక‌వేళ అలా చేసుకోక‌పోతే ఈ ఏడాది డిసెంబ‌ర్‌లోగా మీ పాన్ కార్డ్ ప‌నిచేయ‌కుండా పోతుంది. కొత్త‌గా పాన్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌న్నా ఆధార్ నంబ‌ర్‌ను క‌చ్చితంగా ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిబంధ‌న విధించింది.