Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వీర కర్ణుడిగా విక్రమ్ భారీ బడ్జెట్ చిత్రం

Category : movies

ఒకప్పుడు భారీ బడ్జెట్ చిటెమ్ అంటే కేవలం నార్త్ నుంచి బాలీవుడ్ లో మాత్రమే తెరకెక్కించేవారు. మన సౌత్ సినిమా లకు అంత పెట్టుబడి పెట్టడానికి ఎవ్వరు ధైర్యం చేసేవారు కాదు. మన హీరోల మార్కెట్ కూడా అంత ఉండేది కాదు.

కానీ ఎప్పుడు పరిస్థితి మారిపోయింది. మన తెలుగు సినిమాలు బాలీవుడ్ సినిమా లను మించి ఉంటున్నాయి. బాహుబలి నార్త్ రికార్డ్స్ మొత్తం బ్రేక్ చేసి తెలుగు సినిమా సత్తా చాటింది. హిందీ భారీ బడ్జెట్ చిత్రాలు విఫలమవుతుంటే మన సౌత్ వాళ్ళు మాత్రం దుమ్ము దులుపుతున్నారు. రోబో కూడా దాదాపు 550 కోట్ల బడ్జెట్ తో రూపొంది అదరగొడుతుంది. ఇక మన తెలుగు నుండి సైరా , సాహూ చిత్రాలు భారీ గా రూపుదిద్దుకుంటున్నాయి.

ఇక తాజాగా చియాన్ విక్రమ్ హీరోగా మహావీర్ కర్ణ అనే సినిమా తెరక్కబోతుంది. ఈ విషయాన్నీ చిత్రం టీం అధికారంగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. మలయాళం దర్శకుడు RS విమల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రోజున ఈ సినిమా తిరువనంతపురం .. అనంతపద్మనాభ స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. దర్శక నిర్మాతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారుగానీ .. కొన్ని కారణాల వలన విక్రమ్ మాత్రం రాలేదు. 300 కోట్లకి పైగా బడ్జెట్ తో నిర్మించే ఈ సినిమాని 10 భాషల్లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. మహాభారత కర్ణుడి పాయింట్ అఫ్ వ్యూ లో ఈ సినిమా ఉండబోతుందట. సినిమా విజువల్స్ కి అధిక ప్రాధాన్యత ఉందట.