Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జీ తెలుగు "టాక్సీ వాలా".... "గీత గోవిందం" 20.8 రేటింగ్ బ్రేక్ చేస్తుందా ...?

Category : movies

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకి ఉన్న ఫాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా వేరే చెప్పనక్కర్లేదు.టాప్ హీరోలకు సైతం కష్టం గా ఉండే వంద కోట్ల మార్క్. ఈ హీరో అవలీలగా దాటేస్తూ సినిమా సినిమాకి సూపర్ హిట్స్ తన ఖాతలో వేసుకుంటున్నాడు.

అయితే విజయ దేవరకొండ క్రితం ఏడాది 'గీతగోవిందం', 'టాక్సీవాలా' సినిమాలు ఘన విజయాలను అందించాయి. ఈ రెండు సినిమాలు కూడా విజయ్ దేవరకొండ కెరియర్లో చెప్పుకోదగినవిగా నిలిచిపోయాయి .. ఆయనను స్టార్ హీరోగా మార్చేశాయి.

అలాంటి ఈ సినిమాలలో ఆల్రెడీ 'గీత గోవిందం' బుల్లితెరపై ప్రసారమై 20.8 రేటింగ్ తెచ్చుకుంది. ఇప్పటివరకు మన టాలీవుడ్ సినిమాలకి సంబంధించి ఇదే అత్యధిక రేటింగ్

కావడం విశేషం.ఈ సినిమా తరువాత రిలీజ్ అయ్యి సూపర్ హిట్ కొట్టిన 'టాక్సీవాలా'. ఈ చిత్రాన్ని కూడా మంచి శాటి లైట్ రైట్స్ కె అమ్ముడు కావడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ మూవీని జీ తెలుగువారు ఈ నెల 17వ తేదీన (ఆదివారం) సాయంత్రం 6 గంటలకు ప్రసారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా 'గీత గోవిందం' రేటింగ్ ను అధిగమిస్తుందా .. లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఒక వేళా ఆ రేటింగ్ ని అందుకుంటే మాత్రం మరో రికార్డు విజయ్ ఖాతాలో పడినట్టే అవుతుంది.

Related News