//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రేవంత్‌రెడ్డి స‌వాల్ : నిల‌బ‌డ‌తాడా..? తూచ్ అంటాడా..?

Category : politics state

తెలంగాణలో జ‌రిగిన ముంద‌స్తు ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపులో కొడంగ‌ల్ ప్ర‌జా కూట‌మి ఎమ్మెల్యే అభ్య‌ర్థి, కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఓట‌మిపాల‌య్యారు. అయితే,  విభ‌జ‌న‌కు ముందు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2009 సాధార‌ణ ఎన్నిక‌లు, అలాగే, 2014 సాధార‌ణ ఎన్నిక‌ల్లో కొడంగ‌ల్ నుంచి రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగ‌తి తెలిసిందే. 



2017లో కొడంగ‌ల్ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ‌లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆ స‌మ‌యంలోనే రేవంత్‌రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా రాహుల్ గాంధీ నియ‌మించారు. అంత‌కు ముందు నేంచే కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గాన్ని కైవ‌సం చేసుకోవాల‌ని ప్లానేసిన తెరాస నేత‌లు ప‌ట్నం నరేంద‌ర్‌రెడ్డిని రంగంలోకి దించారు.





ఒక ప‌క్క ప‌ట్నం న‌రేంద‌ర్‌రెడ్డి సేవా కార్య‌క్ర‌మాల‌తో దూసుకుపోతూ ప్ర‌చారం నిర్వ‌హిస్తే.. మ‌రో ప‌క్క నరేంద‌ర్‌రెడ్డికి మ‌ద్ద‌తుగా హ‌రీశ్‌రావు ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు.  ఆ వ్యూహం ఫ‌లించ‌డం ఒక విష‌య‌మైతే, ఎన్నిక‌ల‌కు రెండు రోజుల ముందు రేవంత్‌రెడ్డిని అరెస్ఠు చేయించ‌డం మ‌రో ఎత్తు. హైకోర్టు తీర్పు నేప‌థ్యంలో విడుద‌లైన రేవంత్‌రెడ్డి ఆ స‌మ‌యంలోనే మీడియా వేదిక‌గా తెరాస నేత‌ల‌కు స‌వాల్ విసిరారు. కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో తాను ఎమ్మెల్యేగా ఓడిపోతే రాజ‌కీయాల‌కు స్వ‌స్తి చెప్పి స‌న్యాసం తీసుకుంటాన‌ని ప్ర‌క‌టించారు. ఇప్పుడు ఆ స‌వాలే సోష‌ల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. మ‌రి రేవంత్ రెడ్డి చెప్పిన‌ట్టు రాజ‌కీయం తీసుకుంటాడా..?  లేక అంద‌రి రాజ‌కీయ నాయ‌కుల్లానే రేవంత్ రెడ్డి కూడా తూచ్ అంటాడో తెలియాలంటే మ‌రికొద్ది స‌మ‌యంపాటు ఆగ‌క త‌ప్ప‌దు.