//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నీట్‌ రద్దు అవుతుందా?

Category : national

ఎంబిబిఎస్‌, బిడిఎస్‌, ఆయుష్‌ వైద్య విద్యల ప్రవేశాల కొరకు ఆదేశించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష ( నీట్‌-2017 )పై సర్వతరా ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 7న నిర్వహించిన నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయి అంటూ విద్యార్ధి సంఘాలు, స్వచ్చంద సంస్థలు కోడైకూస్తున్నాయి. ఈ నేపథ్యంలో నీట్‌ పరీక్షను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. నీట్‌ పేపర్‌ లీకైందంటూ సంకల్ప్‌ ఛారిటబుల్‌ ట్రస్టు అనే స్వచ్ఛంద సంస్థ గురువారం పిటిషన్‌ను దాఖలు చేసింది. మరోవైపు నీట్‌ ఫలితాలు వెల్లడించొదంటూ మద్రాస్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జూన్‌ 7వ తేదీలోపు అఫిడవిట్‌ దాఖలు చేయాలని మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, సిబిఎస్‌ఇ డైరెక్టర్‌, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలను ఆదేశించింది.

వాస్తవాన్ని జూన్‌ 8న ఫలితాలు విడుదల కావాలి. కానీ కోర్టు స్టే విధించడంతో ఫలితాలు జూన్‌ 8న వచ్చే అవకాశం దాదాపు తక్కువే. సుప్రీంకోర్టు కూడా నీట్‌ అంశంపై అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని, మద్రాస్‌ హైకోర్టు విచారిస్తున్నందున వేసవి సెలవుల అనంతరం తమ దృష్టికి తీసుకురావాలని పిటిషనర్‌ తరుఫు న్యాయవాదికి సూచించింది. ఈ పరిణాల నేపథ్యంలో నీట్‌ పరీక్ష రద్దు అవుతుందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. నీట్‌ పరీక్షలో అక్రమాలు జరిగిన మాట వాస్తవేమని, రద్దుచేసి మళ్లీ నిర్వహించ డమే సరైందని వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో విద్యార్ధుల్లో ఆందోళన నెలకొంది.

ఈ నెల జరిగిన నీట్ పరీక్షకు దేశవ్యాప్తంగా దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు ఇంగ్లీష్‌ మీడియం వారికో ప్రశ్న పత్రం, ప్రాంతీయ మాధ్యమంలో పరీక్ష రాసిన విద్యార్థులకు మరో ప్రశ్న పత్రం ఇవ్వడంతో వివాదం మొదలైంది. మొత్తం 180 ప్రశ్నలకు గాను 30 నుంచి 40 ప్రశ్నలు వేర్వేరుగా వచ్చాయి. సిలబస్‌లో లేని ప్రశ్నలూ వచ్చాయి. జువాలజీలో మూడు, ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో రెండు ప్రశ్నలు సిలబస్‌లో లేవని నిపుణులు పేర్కొన్నారు. ఇందువల్ల తుది ర్యాంకింగ్‌లో ప్రాంతీయ మాధ్యమం విద్యార్ధులు తీవ్ర నష్టం జరుగుతుంది.