//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గంటా ఎవరూ ఊహించని ఆ స్థానం నుండి ఎందుకు పోటీ చెయ్యాలనుకుంటున్నారు

Category : state politics

ఏపీలో టీడీపీ సంక్రాంతికి అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించే ఆలోచనలో ఉంది . అయితే తొలిజాబితా లో ముఖ్యంగా ఎలాంటి కాంట్రవర్సీలు లేని సిట్టింగ్ మంత్రుల పేర్లు ఉండే అవకాశం వుంది. ఈ నేపధ్యంలో ఉత్తరాంధ్రలో రాజకీయం రోజు రోజుకో రకంగా మారుతుంది. ఇక ఉత్తరాంధ్రలో పై చెయ్యి సాధించాలని అధికార టీడీపీ, వైసీపీ లతో పాటు జనసేన కూడా శతవిధాలా ప్రయత్నం చేస్తోంది. అక్కడ పోటి చేసే అభ్యర్ధుల విషయంలో అధికార, విపక్షాలు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. జనసేన పార్టీకి అక్కడ సామాజికవర్గ అండ ఉండటంతో దానిని ఎదుర్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మిగతా పార్టీ నేతలు. అధికార పార్టీ ముఖ్యంగా జనసేన బలంగా ఉన్న ప్రదేశాల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని సర్వేలు నిర్వహిస్తూ అభ్యర్ధులకు సీట్లు ఖరారు చేస్తుంది. ఇందులో భాగంగా మంత్రులు సీనియర్ నేతలకు సంబంధించిన సీట్లపై దృష్టి పెట్టారు.

ఈ నేపధ్యంలో ప్రస్తుతం భీమిలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు ఇప్పుడు నియోజకవర్గం మారే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన అనకాపల్లి నుంచి పోటి చేసే అవకాశాలు ఉన్నాయని పార్టీ నేతలు అంటున్నా ఆయన వైజాగ్ నుంచి పోటి చేస్తారని మంత్రి సన్నిహితులు అంటున్నారు. అయితే మంత్రి చూపు మాత్రం పక్కన ఉన్న విజయనగరం మీద ఉందని అంటున్నారు. ఆయన ప్రస్తుతం విజయనగరం జిల్లాకు ఇంచార్జ్ మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అక్కడి పరిస్థితులను అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా సామాజికవర్గాల రీత్యా ఆయనకు అనుకూల నియోజకవర్గం కావడంతో నెల్లిమర్ల నుంచి బరిలో దిగే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

మంత్రి గంటా పోటీ చేస్తే మద్దతు ఇస్తామంటూ కొంతమంది వైసీపీ నేతలు హామీ ఇచ్చినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం కూడా జరుగుతుంది. దీనితో మంత్రి ఇప్పుడు అక్కడ పోటి చేస్తారని అంటున్నారు. అవసరమైతే తొలి జాబితాలోనే తన పేరు వచ్చే విధంగా మంత్రి జాగ్రత్తలు పడుతున్నారని అంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఉన్న స్థానిక నేతలతో ఆయన మంతనాలు కూడా జరుపుతున్నారట.

ఎంపీ పూసపాటి అశోక్‌ గజపతిరాజు ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తునట్లు వార్తలు రావడం గంటాకు ప్రతికూలంగా మారిందని పార్టీ నేతలు అంటున్నారు. ఒకవేళ ఆయన అసెంబ్లీ కి పోటి చేస్తే అశోక్ కి మంత్రి పదవి తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి తరుణంలో జిల్లాకు రెండు మంత్రి పదవులు ఇవ్వడం అనేది సాధ్యం కాదు కాబట్టి గంటా ఏం చేస్తారు అనేది ఆసక్తిగా మారింది. ఒకవేళ ఆయన పార్లమెంట్ కి పోటి చేస్తే ఆయన కుమార్తె ఇక్కడి నుంచి పోటి చేస్తారని అప్పుడు యువ నాయకురాలు కావడంతో గంటాకు ఇబ్బంది ఉండదని అంటున్నారు. మొత్తానికి గంటా ఎవ్వరూ ఊహించని స్థానం నుండి బరిలోకి దిగాలనుకుంటున్నారు.అందుకు కారణం కూడా ఇదేనట .