ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆట భారత్ - పాకిస్థాన్ ల మధ్య మరో రెండు రోజులలో లండన్ లో జరగనుండగా, మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా పాకిస్తాన్ ఫైనల్స్ కు చేరినదని ఆరోపణ రావడం సంచలనం కలిగిస్తున్నది. పైగా ఈ ఆరోపణ చేసినది పాకిస్తాన్ జట్టులోని మాజీ క్రీడాకారుడు ఆమీర్ సోహైల్ కావడం ఆసక్తి రేపుతున్నది.
పాకిస్తాన్ లోని ఒక టివి ఛానల్ లో మాట్లాడుతూ `బాహ్య అంశాల' కారణంగానే పాకిస్తాన్ జట్టు ఫైనల్స్ కు చేరుకున్నదని ఆరోపించారు. ఈ విజయానికి సర్ఫరాజ్ అహ్మద్ కెప్టెన్ గా ఉన్న జట్టు సంబరాలు చేసుకోవలసింది ఏమీ లేదని కూడా సోహైల్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ అనూహ్యంగా ఇంగ్లాండ్ పై విజయం సాధించి ఫైనల్స్ కు రావడానికి బాహ్య అంశాలే కారణం అంటూ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినదని సంకేతం ఇచ్చారు.
1966 ప్రపంచ కప్ పోటీల్లో భారత క్రీడాకారుడు వెంకటేష్ ప్రసాద్ తో వివాదంకు దిగడం ద్వారా ప్రచారం పొందిన సోహైల్ "నీవు ఘనకార్యం ఏమీ చేయలేదని సర్ఫరాజ్ కు చెప్పాలి. ఈ ఆటలో నీవు గెలవడం కోసం మరెవ్వరో సహాయం చేశారు. ఈ ఆటను ఎవ్వరు గెలిపించారో వివరాలకు వెళ్ళేటట్లు చేయమాకు. ఫీల్డ్ లో ప్రతిభ కారణంగా కాదు. బాహ్య అంశాలతో ఫైనల్స్ కు వారు చేరుకున్నారు. ఇప్పుడైనా మంచి క్రికెట్ ఆడటం పట్ల ద్రుష్టి సారించాలి" అని హితవు చెప్పారు.
పైగా భారత్ - పాకిస్తాన్ జట్లు ఫైనల్స్ కు వచ్చే విధంగా బొక్కిస్ ప్రయత్నం చేశారని కూడా ఆరోపించారు. అయితే తన మాటలను అసందర్భంగా తీసుకొంటున్నారని అంటూ తరువాత మాటమార్చి వేశారు. మొదటిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ కు పాకిస్తాన్ చేరుకోవడం గమనార్హం.