//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

లగడపాటి సర్వేపై విమర్శల వెల్లువ .... రీజన్ అదేనా

Category : politics state

తెలంగాణా ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది అన్న దానిపై పలు సర్వేలు హడావిడి చేశాయి. అన్నిటి కంటే లగడపాటి సర్వేకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే లగడపాటి చంద్రబాబు పక్షం వహించి తన క్రెడిబులిటీ దెబ్బ తీసుకుంటున్నారు. ప్ర‌జాకూట‌మి వ‌ర్సెస్ టీఆర్ఎస్ యుద్ధంలో ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ న‌లిగిపోతున్నాడు. ఆయ‌న డ‌బ్బులు ఖ‌ర్చుపెట్టుకుని మ‌రీ స‌ర్వే చేసి జ‌నాల‌తో తిట్లు తింటున్నాడు. అందుకు కారణం లేకపోలేదు. మొదట నుండి చంద్రబాబు పార్టీ తో సన్నిహితంగా ఉన్న లగడపాటి మొదట టీఆర్ ఎస్ గెలుస్తుంది అని ఏకంగా కేటీఆర్ కే చెప్పి తర్వాత మాట మార్చారు. కూటమిదే విజయం అని చెప్పి కాంట్రవర్సీ కి ఆర్జ్యం పోశారు . అత‌ను గ‌తంలో రాజ‌కీయ నాయ‌కుడే కావ‌చ్చు గాని సర్వేల విషయంలో లగడపాటి ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదు. కానీ ఇప్పు చంద్రబాబు ప్రభావంతో ఆయన పోలింగ్ ముగిసిన త‌ర్వాత అబ‌ద్ధాలు చెప్పారని అంటున్నారు. త‌న క్రెడిబులిటీ పోగొట్టుకోవటం మినహాయించి ఇది వేరు కాదనే భావన కూడా వ్యక్తం అవుతుంది. దీంతో ఆయ‌న‌పై చాలా తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ల‌గ‌డ‌పాటి ధైర్యంగా చెప్ప‌లేక‌పోతున్నార‌ని, మాట్లాడేట‌పుడు త‌డ‌బ‌డుతున్నాడ‌ని అన్న టీఆర్ఎస్ నేత సీతారాం నాయ‌క్ ల‌గ‌డ‌పాటి స‌ర్వేను అనుమానించారు. అంతేకాదు, ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌ల‌న్నీ టీఆర్ఎస్‌కే ప‌ట్టం క‌ట్టాయ‌ని, ల‌గ‌డ‌పాటి మూడు నెల‌ల నుంచి స‌ర్వే చేసి అంత త‌డ‌బాటు ఎందుక‌న్నారు. ఒక ఫిగ‌ర్ చెప్ప‌లేక‌పోతున్నాడు. టీఆర్ఎస్‌కు 35 కు అటు ప‌ది ఇటు ప‌ది అంటున్నాడు. దీనికి ఏం క్రెడిబులిటీ ఉంటుంది? అని ఆయ‌న ప్ర‌శ్నించారు.మ‌రో బీజేపీ నేత విష్ణువ‌ర్ద‌న్‌రెడ్డి కూడా దీనిపై స్పందించారు. అది టీడీపీ ఆఫీసులో వండిన స‌ర్వే అని మండిప‌డ్డారు. బీజేపీకి 7 కాదు, ప‌ది స్థానాలు వ‌స్తాయి. తెలంగాణ‌లో హంగ్ వ‌స్తుంది. మేము లేకుండా ప్ర‌భ‌త్వ‌మే ఏర్ప‌డ‌దు అన్నాడు. ల‌గ‌డ‌పాటిని టీడీపీ వాళ్లు అంత భుజానికి ఎత్తుకోవాల్సిన అవ‌స‌రం ఏముంది అని ప్ర‌శ్నించారు. ల‌గ‌డ‌పాటి త‌న క్రెడిబులిటీ పోగొట్టుకున్నాడ‌ని విష్ణు వ్యాఖ్యానించారు.

ఇంత కాలం తన సర్వేలు నిజం అయ్యాయని చెప్పిన లగడపాటి సర్వే తప్పని తెలంగాణాలో రానున్న ఫలితాలు తేల్చి చెప్పనున్నాయని ఇప్పటికే గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక నుండి తన సర్వేలపై జనం విశ్వాసం చూపించారని చెప్తున్నారు. అనవసరం గా బాబు మాయలో పది తన క్రెడిబులిటీ తానే నాశనం చేసుకుంటున్నారని అంటున్నారు.

Related News