Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జ‌న‌సేన జ‌నం కోస‌మా .. ? అభిమానుల కోస‌మా ...?

Category : state politics

తాజాగా దేశంలో జ‌రిగిన ఎన్నిక‌లు ఎలా ఉన్న ,ఏపీ ఎన్నిక‌లు మాత్రం తీవ్ర ఉత్కంట‌కు తెర‌లేపాయ‌నే చెప్పాలి .ప్ర‌స్తుతం ఎన్నిక‌లు ముగిసిన సంద‌ర్భంగా ..ఎన్నిక‌ల త‌ర్వాత ఎవ‌రి దారి ఎటు వైపు అనే దాని పై చ‌ర్చ న‌డుస్తుంది .ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు ఏపీలో హంగ్ వ‌స్తుంద‌ని ,జ‌న‌సేన కింగ్ ,లేక కింగ్ మేక‌ర్ అయ్యే చాన్సుంద‌ని చాలా మంది భావించారు.కానీ ...ఎన్నిక‌ల త‌ర్వాత అది కాస్త రివ‌ర్స్ అయిన‌ట్లు క‌నిపిస్తుంది .టీడీపీ ,వైసీపీల‌లో ఏదో ఒక పార్టీకి స్ప‌ష్ట‌మైన ఆధిక్య‌త వ‌స్తుంద‌నే సంకేతాలు వెలువ‌డుతున్నాయి.

అయితే ఈ రెండు పార్టీల‌లో ఏ పార్టీ ఓడిన ప్ర‌తి ప‌క్ష పార్టీగా జ‌నం మ‌ధ్య‌లో ఉంటారు.కానీ...ప‌వ‌న్ జ‌నం మ‌ధ్య‌లో ఉండే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉన్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.దీనికి ప్ర‌ధాన కార‌ణం ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన త‌రుపున నిల‌బ‌డిన నాయ‌కులు గెల‌చేప‌రిస్థితిలో లేక‌పోవ‌డం అనే చెప్పాలి.అంతే కాకుండా ప‌వ‌న్ పోటి చేసిన స్థానాల‌లో కూడా గెలిచే అవ‌కాశాలు త‌క్కువ అనే అనుమానాలు కొంద‌రిలో నెల‌కొని ఉండ‌డంతో ,అత‌ని దారి ఎటు వైపు ఉంటుంద‌నేది ప్ర‌స్తుతం ప్ర‌శ్నర్త‌కంగా మారింది .జ‌న‌సేన పోటి చేసిన స్థానాల‌లో ఖాత తెర‌వ‌కుంటే ఆ పార్టీ నాయ‌కుడు సినిమాల వైపు మొగ్గు చూపే అవ‌కాశం ఉంద‌ని కొన్ని వ‌ర్గాల వాద‌న....అయితే ఈ వాద‌న‌ల‌కు ప్ర‌ధాన ఉద్దేశం మాత్రం ప‌వ‌న్ వ‌ద్ద డ‌బ్బులు లేక‌పోవ‌డం అనే తెలుస్తుంది .

ఏపీలో మ‌రి కొన్ని నెల‌లో ఎన్నిక‌లు జ‌రుగబోతున్నాయ‌నే స‌మ‌యంలో ప‌వ‌న్ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్ల‌డం ప్రారంభించారు.అంత‌కు ముందే కొన్ని ఉద్య‌మాల‌లో పాల్గోన్న ,పూర్తిగా రాజ‌కీయాల‌లోకి వ‌చ్చింది మాత్రం ఈ స‌మ‌యంలోనే అని చెప్పాలి .అయితే ప‌వ‌న్ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చిన సంద‌ర్భంలో ప్ర‌జ‌లు ఆద‌రించిన తీరును చూసి చాలా మంది నుండి విరాళాలు అందాయి .కానీ ..ప్ర‌స్తుతం ప‌వ‌న్ ప‌రిస్థితి చూస్తే విరాళాలు వ‌చ్చే అవ‌కాశాలు క‌న‌బ‌డ‌డంలేదు .దాంతో ప‌వ‌న్ ఉన్న ఒకే ఒక ప్ర‌త్య‌మ్నాయం సినిమాలు చేయ‌డం త‌ప్ప ఇంకోటి లేద‌నే చెప్పాలి .అయితే ఇదంతా తెలియాలంటే మే 23న వ‌చ్చే ఎన్నిక‌ల ఫ‌లితాల వ‌ర‌కు ఆగ‌క త‌ప్ప‌దు .

Related News