//single page style gallary page

is it worse from behind eye problems ?

Category : health

Click here to read this article in Telugu

కంటి సమస్యల వెనుక మతిమరుపా..?

శరీరంలోని రెండు అవయవాల మధ్య ఉండే అంతర సంబంధాల్ని గమనిస్తే ఒక్కోసారి చాలా ఆశ్చర్యం వేస్తుంది. లేకపోతే... దెబ్బ తిన్న రెటీనా ఆధారంగా వారిలో మతిమరుపు (డిమెన్షియా) సమస్య ఉన్నట్లు తేల్చేయడమేమిటి? ఇటీవలి ఓ అధ్యయనంలో ఈ విషయమే బయటపడింది. రెటీనాలోని రక్తనాళాలు దెబ్బ తినడం అనేది వారిలో మతిమరుపు వ్యాధికి సంకేతంగా కూడా భావించాలని వారంటున్నారు. కొంతమంది పరిశోధకులు ఇటీవల 69 నుంచి 97 ఏళ్లకు మధ్యవయస్కులను వారిని పరిశీలించారు.

అయితే, ఆ వర్గంలోని 50 శాతం కన్నా ఎక్కువ మంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నట్లు స్పష్టమయ్యింది. ఈ రక్తపోటు కారణంగా సహజంగానే కొందరిలో రెటీనాలోని రక్తనాళాలు దెబ్బ తింటాయి. అయితే, ఈ సమస్య ఇక్కడికే పరిమితం అనుకుంటే, అది సరికాదు అంటున్నాయి పరిశోధనలు. ఎందుకంటే ఇలా కంట్లోని రక్తనాళాలు దెబ్బ తిన్న వారి కేంద్రనాడీ వ్యవస్థలోనూ అంటే మెదడులోనూ కొన్ని సమస్యలు ఉంటాయనే మరో నిజం కూడా ఈ సందర్భంగా బయటపడింది. దీని వల్ల కలిగే దుష్ప్రభావం ఏమిటంటే, వీరికి మతిమరుపు వ్యాధి కూడా ఉంటుంది. అందుకే కంటి సమస్యలు తలెత్తిన వాళ్లు అప్పుడప్పుడు న్యూరాలజిస్టును కూడా సంప్రదిస్తూ ఉండాలని పరిశోధకులు చెబుతున్నారు.

It is a surprise to see the intimate relationships between the two organs in the body. Otherwise, what is the problem of retardation on the retinal basis of the mental health (dementia)? This is a recent study. The blood vessels in the retina are also thought to be a sign of mystery disease. Some researchers have recently examined the aged between 69 and 97 years.

However, it is clear that more than 50 percent of the population is suffering from high blood pressure. Naturally, some of the blood vessels in the retina have been affected by this blood pressure. However, if the problem is limited here, it is not right. Another fact is that there are some problems in the central system of the brain and the brain that has been caused by the blood vessels in the eye. The consequence of this is that they have a mental illness. The researchers say that people who have had eye problems may also occasionally contact the neurologist.