//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చలి పుడితే కనిపించిన అమ్మాయిపై ముద్దుల వర్షమా !

Category : national

బెంగళూరు నగరంలో నడిరోడ్డులో కనిపించిన ఒక యువతిపై ముద్దుల వర్షం కురిపించి,  లిప్ లాక్ చేసి ఒక కామాంధుడు పరారై, తర్వాత పోలీస్ లకు చిక్కాడు. పరారైన కామాంధుడిని ఇందిరానగర్ సమీపంలోని ఆనందపురలో నివాసం ఉంటున్న సంతోష్ అనే వ్యక్తిగా  గుర్తించి జీవన్ భీమానగర్ పోలీసులు అరెస్టు చేశారు.

టెక్కీ క్యాబ్ దిగి ఇంటికి వెడుతున్న  యువతిని నడిరోడ్డులో నలిపేశారు. జూన్ 17వ తేదీ అర్దరాత్రి జీవన్ భీమానగర్ బస్ స్టాప్ సమీపంలో ఒక  లేడీ టెక్కీ ఉద్యోగం ముగించుకుని క్యాబ్ లో జీవన్ భీమా నగర్ లోని బస్ స్టాప్ దగ్గర దిగి ఇంటికి నడుచుకుంటూ వెళ్లడం చూసాడు. వెంటనే నడిరోడ్డులో లేడీ టెక్కీని గట్టిగా పట్టుకుని ముద్దుల వర్షం కురిపించాడు. తరువాత లిప్ లాక్ చేశాడు. యువతి తేరుకునే లోపు సంతోష్ చీకటిలో మాయం అయ్యాడు.

ఎందుకు యువతికి ముద్దులు పెట్టావు అంటూ పోలీసులు ఆరా తీస్తే సంతోష్ ఇచ్చిన సమాధానం విని పోలీస్ లు అదిరి పోయారు. క్యాబ్ దిగిన యువతి ఒంటరిగా వెలుతోందని, ఆ సమయంలో అటు వైపు ఎవ్వరూ రాకపోవడం, ఎక్కువ చలిగా ఉండటంతో తట్టుకోలేక కొంచెం రెచ్చిపోయి ముద్దులు పెట్టానని చెప్పడంతో పోలీసులు షాక్ కు గురయ్యారు. బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలు పరిశీలించి సంతోష్ ను పోలీస్ లు అరెస్టు చేశారు.