//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అక్షర తృతీయకి బంగారం కొంటే కష్టాలు కొన్నట్లేనా..?

Category : editorial

మన తెలుగోళ్లు ఏదైనా పబ్లిసిటీ ఇస్తే దానికి ఇట్టే అట్రాక్ట్ ఐపోతారంటారు. అసలు ఇంతకుముందు అంటే ఓ 20ఏళ్ల క్రితం అక్షర తృతీయ అంటే ఎవరికీ తెలీదు. కానీ ఇప్పుడో అది బాగా ఫాలో అయ్యే మళయాళ, అరవతంబీలకంటే ఎక్కువగా మనమే రెడీ అయిపోతున్నాం. ఖచ్చితంగా ఆ రోజున బంగారం వెండి కొనాలంటూ ఊదరగొట్టే ప్రకటనలతో షాపుల ముందు క్యూ కట్టడం చూస్తున్నాం.. ఐతే నిజంగా ఇలా చేయొచ్చా..చేస్తే అదృష్టం కలిసి వస్తుందా అంటే లేదని అసలు సిసలు పండితులు తేల్చి చెప్పారు.

అక్షర తృతీయ రోజున పార్వతీదేవి అమ్మవారికి బంగారంతో సహా పూలు, పళ్లు నైవేద్యం పెట్టి వ్రతం చేయాలే కానీ..ఇలా షాపులకు వెళ్లి బంగారం కొనకూడదట. వ్రతం పూర్తైన తర్వాత చేతనైనంత బంగారం లేదంటే వెండి దానం చేయాలట..అలా చేస్తే అదృష్టమట..అంతేకానీ ఇళ్లూ వళ్లూ గుల్ల చేసుకుని బంగారం షాపుల ముందు వేలంవెర్రిగా నగలు కొంటే చివరికి చేతికి చిప్ప మిగులుతుందని పండితులు చెప్తున్నారు. వీలైతే దానాలు చేయడమంటే ఇతరులకు సాయం చేయడం అని..అంతేకానీ ఖరీదైన నగలు సమకూర్చుకుంటే అదృష్టం ఏమో కానీ.. దరిద్రం చుట్టుకోవం ఖాయంగా సదరు పండితుల అభిప్రాయం.