//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అర్జున్‌ను అరెస్టు చేస్తారా..?

Category : movies

అర్జున్‌ను అరెస్టు చేస్తారా..? లేదా అంటూ ఆ హీరోయిన్ ఫైర్ అయింది. అయితే, అర్జున్‌ను ఇప్పుడు అరెస్టు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని కోర్టు చెప్పింది. మొత్తం మీద అర్జున్‌కు ఈ కేస్ ఇబ్బందిక‌రంగానే మారింది. అయితే, అర్జున్‌ను అరెస్టు చేయాలంటూ హీరోయిన్ శృతి హ‌రిహ‌ర‌న్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే.

అర్జున్‌ను వెంట‌నే అరెస్టు చేయొద్ద‌ని క‌ర్ణాట‌క హైకోర్టు తాజాగా పోలీసుల‌ను ఆశ్ర‌యించింది.రెండేళ్ల క్రితం జ‌రిగిన సంఘ‌ట‌న గురించి అర్జున్‌ను వెంట‌నే అరెస్టు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని కోర్టు తీర్పునిచ్చింది. శృతి అర్జున్ మ‌ధ్య కౌగిలించుకునే సీన్ జ‌రుగుతున్న‌ప్పుడు సినిమా షూటింగ్ లొకేష‌న్‌లోనే ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. కాబ‌ట్టి ఆ విష‌యంలో అరెస్టు ఎలా చేస్తార‌ని అర్జున్ న్యాయ‌వాదులు ప్ర‌శ్నిస్తున్నారు. శృతి హ‌రిహ‌ర‌ణ్ కావాల‌నే త‌ప్పుడు సెక్ష‌న్‌ల కింద కేసు ఫైల్ చేయించింద‌ని అర్జున్ ఆరోపిస్తూ కోర్టును ఆశ్ర‌యించారు.

రెండేళ్ల క్రితం ఓ క‌న్న‌డ షూటింగ్ సంద‌ర్భంగా అర్జున్ త‌న‌ను లైంగికంగా వేధించాడ‌ని శృతి ఇటీవ‌ల ఆరోపించింది. మీటూ ఉద‌ద్య‌మంలో భాగంగా అప్పుడు జ‌రిగిన వేధింపుల‌ను ఇప్పుడు బ‌య‌ట‌పెట్టింది. కౌగిలించుకునే సీన్ ఉన్న‌ప్పుడు అర్జున్ హ‌ద్దులు మీరాడ‌ని, డ‌బుల్ మీనింగ్ మాట‌లు మాట్లాడాడ‌ని ఆమె ఆరోపించింది.

ట్విట్ట‌ర్‌లో ఆమె ఈ ఆరోప‌ణ‌లు చేసిన వెంట‌నే అర్జుణ్ ఆమెపై రూ.5కోట్ల ప‌రువున‌ష్ట దావా వేశాడు. దాంతో శృతి పోలీసులను ఆశ్ర‌యించి అర్జున్‌ను అరెస్టు చేయాల‌ని కోరింది. ప్ర‌స్తుతం ఈ విచార‌ణను న‌వంబ‌ర్ 14కు వాయిదా వేసింది క‌ర్ణాట‌క కోర్టు. శృతి వెనుక కొన్ని రాజ‌కీయ శ‌క్తులు ఉన్నాయ‌ని క‌న్న‌డ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆ సంఘాలు అర్జున్‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నాయి. అయితే, శృతి మాత్రం అదంతా అబ‌ద్ధ‌మ‌ని, ఇప్ప‌టికే క్లారిఫికేష‌న్ ఇచ్చింది. 50 సంవ‌త్స‌రాల అర్జున్ ప్ర‌స్తుతం విల‌న్ పాత్ర‌ల‌కు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ రోల్స్‌కు షిప్ట్ అయ్యాడు. అయితే, ఈ వివాదం ఆయ‌న్ను కష్టాల్లోకి నెట్టింది.