//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జి.ఎస్.టి అంటే ఒకటే పన్ను! కాదు కాదు మూడు పన్నులు!

Category : gst state national business

జి.ఎస్.టి పేరుకే ఒక పన్ను. కానీ ఇది మూడు రకాల పన్నుల సమాహారం.
ఎస్.జి.ఎస్.టి/యుటి.జి.ఎస్.టి(SGST/UTGST), సి.జి.ఎస్.టి(CGST), ఐ.జి.ఎస్.టి(IGST).
ఏదైనా ఒక వస్తువు లేదా సేవను సరఫరా చేసినప్పుడు SGST/UTGST + CGST, లేదా IGST లలో ఒకదానిని విధిస్తారు. ఏ ఏ సందర్భాలలో SGST/UTGST + CGST ని విధిస్తారో , ఏ ఏ సందర్భాలలో IGST ని విధిస్తారో ఇప్పుడు చూద్దాం.

SGST/UTGST- రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంతాల వస్తు మరియు సేవల పన్ను.
CGST- కేంద్ర వస్తు మరియు సేవల పన్ను. క్లుప్తంగా ఒక వస్తువు లేదా సేవ పై ఒక రాష్ట్రానికి రావలిసిన పన్ను మరియు కేంద్రానికి రావలిసిన పన్ను అని చెప్పవచ్చును. వీటిని సాధారణంగా ఏదైనా వస్తువు లేదా సేవల సరఫరా ఒకే రాష్ట్రం లోని ఇద్దరు వ్యాపారుల మధ్య జరిగిన లేదా వ్యాపారికి వినియోగదారునికి మధ్య జరిగిన దీనిని విధించటం జరుగుతుంది. దీనినే అంతర్గత రాష్ట్ర సరఫరా అని కూడా అంటారు. SGST మీద వినియోగ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. CGST మీద వినియోగ అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది.

ఉదాహరణ 1:
A అనే వ్యాపారి తెలంగాణ లో నమోదు కాబడి, B అనే మరో తెలంగాణ లో నమోదు కాబడిన వ్యాపారికి ₹10,000 విలువ కలిగిన ఏదైనా వస్తువు సరఫరా చేసాడు. ఆ వస్తువు మీద ఉన్న GST రేట్ 18% అనుకుందాం,అంటే మొత్తం పన్ను ₹1800/-. సరఫరాదారు కొనుగోలుదారు ఇద్దరు తెలంగాణ రాష్ట్రమే కనుక ఇది అంతర్గత రాష్ట్ర సరఫరా కిందకు వస్తుంది. అందువలన SGST 9% + CGST 9% విధించబడుతుంది. అంటే తెలంగాణాకు ₹900/- కేంద్రానికి ₹900/-వెళుతుంది.

IGST - సమీకృత వస్తు మరియు సేవల పన్ను
ఒక వస్తువు లేదా సేవ పై కేంద్రం విధించే పన్ను. ఇది సాధారణంగా ఏదైనా వస్తువు లేదా సేవల సరఫరా ఒక రాష్ట్రం లోని వ్యాపారికి , మరోక రాష్ట్రం లోని వ్యాపారికి మధ్య జరిగినప్పుడు దీనిని విధించటం జరుగుతుంది. దీనినే అంతర్రాష్ట్ర సరఫరా అని కూడా అంటారు. IGST మీద వినియోగ అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది.

ఉదాహరణ 2:
B అనే వ్యాపారి తెలంగాణ లో నమోదు కాబడి C అనే ఆంధ్రప్రదేశ్ లో నమోదు కాబడిన వ్యాపారికి ₹10,000 విలువ కలిగిన ఏదైనా వస్తువు సరఫరా చేసాడు. ఆ వస్తువు మీద ఉన్న GST రేట్ 18% అనుకుందాం. అంటే మొత్తం పన్ను ₹1800/-. సరఫరాదారు కొనుగోలుదారు ఇద్దరూ వేరు వేరు రాష్ట్రాలు కనుక ఇది అంతర్రాష్ట్ర సరఫరా కిందకు వస్తుంది. అందువలన IGST 18% విధించబడుతుంది. కేంద్రానికి ₹1800/-వెళుతుంది.

ఒక వస్తువు అంతర్గత రాష్ట్ర సరఫరా మరియు అంతర్రాష్ట్ర సరఫరా రెండూ జరిగినప్పుడు ఏమి జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.

ఉదాహరణ 3:
A అనే వ్యాపారి తెలంగాణ లో నమోదు కాబడి B అనే మరో తెలంగాణ లో నమోదు కాబడిన వ్యాపారికి ₹10,000 విలువ కలిగిన ఏదైనా వస్తువు సరఫరా చేసాడు. దానిని B ఆంధ్రప్రదేశ్ లో నమోదు కాబడిన C అనే వ్యాపారికి ₹20,000 కి సరఫరా చేసాడు. దానిని C ఆంధ్రప్రదేశ్ లోని D అనే వినియోగదారునికి ₹30,000 కి అమ్మాడనుకుంటే.

ఆ వస్తువు మీద ఉన్న GST రేట్ 18% అనుకుందాం.

A నుండి B కి సరఫరా జరిగినప్పుడు అది తెలంగాణ అంతర్గత రాష్ట్ర సరఫరా అవుతుంది. సరఫరా విలువ ₹10,000. SGST 9% అంటే ₹900 తెలంగాణాకి వెళుతుంది. CGST 9% అంటే ₹900 కేంద్రానికి వెళుతుంది.B నుండి C కి సరఫరా జరిగినప్పుడు అది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ల అంతర్రాష్ట్ర సరఫరా అవుతుంది. సరఫరా విలువ ₹20,000. IGST 18% అంటే ₹3600 కేంద్రానికి వెళుతుంది.C నుండి D కి సరఫరా జరిగినప్పుడు అది ఆంధ్రప్రదేశ్ అంతర్గత రాష్ట్ర సరఫరా అవుతుంది. సరఫరా విలువ ₹30,000. SGST 9% అంటే ₹2700 ఆంద్రప్రదేశ్ కి వెళుతుంది. CGST 9% అంటే ₹2700 కేంద్రానికి వెళుతుంది.

అంటే ఒకే వస్తువు మీద మొత్తం చెల్లించిన పన్ను
తెలంగాణాకి- ₹900, ఆంధ్రప్రదేశ్ కి- ₹2700
కేంద్రం కి- ₹900+₹3600+₹2700= ₹7200
అన్ని కలిపి ₹10,800.


అదేంటి ఇంత పన్ను కట్టాలా ప్రభుత్వాలకు?
GST ని ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్ అన్నారు, ఇంకా గమ్య ఆధారిత పన్ను అని కూడా అన్నారు మీరు, కానీ ఇన్ని పన్నులు వేశారేంటి!
ఇంకా మేమేం వ్యాపారాలు చేస్తాం!
ఈ ప్రశ్నలు మీకు రావచ్చు.

ఇక్కడే ఉంది GST లోని అసలు కిటుకు.
అదే ITC (ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్) - వ్యాపారుల పాలిట బాహుబలి. దీని గురించి

జి.ఎస్.టి గురించి మరిన్ని వివరాలు,విశ్లేషణల www.gstreporting.com వారి సౌజన్యంతో మీకు అందిస్తోంది మీ INS Media.మరింత సమాచారం కోసం ఇక్కడ https://www.ins.media/gst క్లిక్ చేయండి.

Related News