Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎన్నికల కమిషన్ కార్యాలయం వద్ద చంద్ర బాబు ధర్నా......?

Category : state politics

ఏపీ ఎన్నికలకు ఒక రోజే మిగిలి ఉండడంతో ఇప్పటికే అక్కడ అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల కోడ్ అమలులో ఉంది.ఈ సమయంలోనే నిన్న సాయంత్రం 5 గంటల నుండి ప్రచార కార్యక్రమాలు కూడా ముగిసిపోయాయి.ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయకుడు జాతీయ ఎన్నికల సంఘం పై ఆగ్రహం తో ఊగిపోతున్నారు.గత కొన్ని రోజులుగా ఆ పార్టీ నేతలపై జరుగుతున్న ఐటీ దాడులు , అధికారుల బదిలీలపై ఆయన ఎన్ని సార్లు ఈసీ ఎదుట విన్నవించుకున్నా వినేవారు లేరంటూ ఆయన వాపోతున్నారు.

అంతే కాకుండా ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ అక్రమాలకు పాల్పడుతోందని ఆయన తీవ్ర స్థాయి లో ఆరోపిస్తూ, చీఫ్ ఎలక్షన్ కార్యాలయం ముందు ధర్నాకు దిగాలని చూస్తున్నారు. స్వయంగా తానే ఈసీ కి వినతి పత్రం ఇచ్చిన లాభం లేకున్నదని. ఈ నేపథ్యంలోనే ఆయన ఈసీ వైఖరిపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ...ఈసీ కార్యాలయానికి వెళ్లి, అక్కడే ధర్నాకు దిగాలని,ఆయన ఆ పార్టీ నేతలకు సూచించారు. ఈ విషయంలో చంద్రబాబు నిర్ణయానికి టీడీపీ నేతలంతా మద్దతు పలికారు.