బి. జె.పి అనగానే అయోధ్య రామ మందిరం గుర్తుకురావడం సహజం కేంద్రంలో మోదీ తరం ముందు వరకు ఆ పార్టీ మేనిఫెస్టో లో రామ మందిరం ప్రస్తావన ఉండేది. మోదీ ప్రధాని అభ్యర్థిగా తెరపైకి వచ్చిన నాటి నుండి మతపరమైన అంశాలకు , మందిర నిర్మాణాలకు చెల్లుచీటి రాసేసింది ఆ పార్టీ గుజరాత్ మోడల్ అభివృధి నినాదంతోనే మోదీ, దేశ ఓటర్లను తన వైపుకి తిప్పుకుంటున్నారు . అప్పుడపుడు అక్కడక్కడా RSS రామ మందిరం ప్రస్తావన తీసుకొచ్చిన BJP తనకేమి పట్టనట్టు ఉండిపోయింది. ఇప్పుడు రామ జన్మభూమిలో భారతీయ జనతా పార్టీ పాగా వేయడం ఓ హిందూ యోగి ఆ రాష్ట్ర Cm కావడం మళ్లీ రామ మందిరం అంశం మీడియాకెక్కింది. పార్టీ సంచలన నేత సుబ్రహ్మణ్య స్వామి రాజా జన్మ భూమి అయోధ్య స్థలంపై హక్కులు కోరుతూ గత ఏడాది సుప్రీంకోర్టు తలుపులు తట్టారు. తాజాగా ఆ కేసు సందర్భానికి సరిపోయేటట్టు కోర్టు ముందుకి పరిష్కారానికి వచ్చింది సుప్రీకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ J . S . kehar మధ్యే మార్గాన్ని అనుసరించి ఈ కేసును కోర్టుకు వెలుపల పరిష్కరించుకోవాలని సూచించడంతో సున్నితమైన, భావోద్యేగాలతో కూడిన సమస్యకి ఇరు వర్గాలు చర్చలు ద్వారానే సామరస్యంగా సాధించుకోవాలని అవసరమైతే మధ్యవర్తిత్వానికి తాము సన్నద్దమని తెలిపింది. దీంతో ఇప్పుడు ఈ అంశం ఇరు మత పెద్దలు మధ్యవచ్చి పడింది అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో BJP పార్టీ అధికార దండాన్ని పట్టుకుని కూర్చుంది అయితే ప్రధాని మోదీ ఏనాడూ నోరు విప్పి రామ మందిరం గురించి మాట్లాడలేదు .
దేశ ప్రజలు కూడా మరో బాబ్రీ తరహా ఘర్షణలను ఎంతమాత్రం అంగీకరించరు. అందుకు తగ్గట్టుగా మోదీ ఈ సమస్యకి నిశ్శబ్దంగా పరిష్కారం కనుగొంటునే దేశ ప్రజలు హర్షిస్తారు. ఆ విషయం మోదీ కి కూడా బాగా తెలుసు. మందిర నిర్మాణానికి అవసరమైన సరంజామా అయోధ్యలో కొలువుదీరింది. మోదీ గనుక RSS ను, హిందూ అనుబంధ సంస్థలను, సొంత పార్టీ నేతలను కట్టడి చేయకపోతే సమస్య సామరస్యంగా పరిష్కారం కావడం అసాధ్యం. తరతరాలకు ఆదర్శంగా నిలిచిన శ్రీరాముడి మందిరాన్ని అప్రజాస్వామికంగా నిర్మించకపోవడమే ఉత్తమం. జన రంజకంగా పాలించిన శ్రీరాముడు ఇష్టపడేది శాంతి కాముక దేశం గానీ, అశాంతి నిండిన రాజ్యాన్ని ఎంతమాత్రం కాదు.