సైనిక తిరుగుబాటులకు అలవాటైన పాకిస్థాన్ లో ఇప్పుడు సుప్రీం కోర్టు తిరుగుబాటు చేసింది. ప్రధాని నవాజ్ షరీఫ్ ఆ పదవిలో ఉండడానికి అనర్హుడని ప్రకటించింది. పాకిస్తాన్ చరిత్రలో అత్యంత ప్రజాదారణ గల ప్రధానమంత్రిగా పేరొందిన భుట్టో ను సహితం ఒక కేసులో దోషిగా నిర్ధారించి 1979లో సుప్రీం కోర్ట్ ఉరి తీయించడం తెలిసిందే.
భుట్టో కూడా భారత్ తో స్నేహ హస్తం చాచడంతో సైన్యం కన్నెర్ర చేసింది. పాకిస్థాన్ లో సుప్రీం కోర్టు ఎప్పుడు సైన్యానికే దండుగా ఉండటం తెలిసిందే. షరీఫ్ కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ తో స్నేహం జరపడంతో ఆగ్రహంగా ఉన్న సాయం ప్రోద్భలంతోనే సుప్రీం కోర్ట్ ఇటువంటి తీర్పు ఇచ్చిన్నట్లు తెలుస్తున్నది.
నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరు కావడంతో పాటు షరీఫ్ తన పుట్టిన రోజు పండుగకు, మనువరాలి వివాహానికి కూడా మోడీని ఆహ్వానించడం తెలిసిందే. పైగా భారత్ - పాకిస్తాన్ ల మధ్య సంబంధాలను మెరుగు పరచేందుకు మోడీ తో ప్రయత్నాలు చేబట్టడం తెలిసిందే.
మోడీ లాహోర్ పర్యటన కాగానే భారత్ లో పఠాన్ కోట్ సైనిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి జరిగింది. ఆ తరువాత కూడా విదేశంలో మోడీ ని షరీఫ్ కలవడంతో ఆగ్రహంగా ఉన్న సైన్యానికి సైన్యానికి పనామా పేపర్లలో షరీఫ్, ఆయన కుటుంబ సభ్యుల పేర్లుండటం వరంగా మారింది.
భవిష్యత్ లో మరే ప్రధాని భారత్ తో స్నేహం చేసేందుకు సాహసం చేయకూడదనే షరీఫ్ ను లక్ష్యంగా చేసుకున్నట్లు కనబడుతున్నది. భుట్టో ను చేసిన్నట్లు ప్రాణం తీస్తుకుంటారా లేదా ప్రాణాలతో వదిలి వేస్తారా చూడవలసి ఉంది.
ఇంతకు ముందు ప్రధానిగా ఉన్న సమయంలో నాటి ప్రధాని వాజపేయిని శాంతి చర్చల కోసం లాహోర్ కు ఆహ్వానించినందుకు కార్గిల్ యుద్ధం చేయడమే కాకుండా షరీఫ్ ను పదవి నుండి తొలగించి ముషారఫ్ అధికారం చేపట్టడం చూసాము.