//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దెందులూరు డౌటేనా ...చింతమనేని విషయంలో బాబు ఆ నిర్ణయం తీసుకున్నారా

Category : politics

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే అన్ని పార్టీల్లో హడావిడి నెలకొంది. ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డారు. అధికార టీడీపీ సర్వేలు నిర్వహిస్తూ జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ టికెట్ల కేటాయింపు చేస్తుంది. చంద్రబాబు ఈ సారి జరగనున్న ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నేపధ్యంలో ప్రతి నియోజకవర్గం పై ప్రత్యేక దృష్టి పెట్టారు. అందులో భాగం గా చింతమనేని ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న దెందులూరు నియోజకవర్గంలో ఈసారి ఎవరికి అవకాశం ఇవాలి అనేదానిపై చంద్రబాబు ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

దెందులూరు ఈ సెగ్మెంట్ తెలుగుదేశం పార్టీ కంచుకోట . చాలా మంది హేమా హేమీ నాయ‌కులు కూడా ఈ సెగ్మెంట్లో గెలిచారు.. కమ్మ సామిక వర్గ నేతలకు పట్టం కట్టే సంస్కృతి ఈ నియోజకవర్గం లో ఉంది. వాస్త‌వంగా చెప్పాలి అంటే, సామాజిక సమీకరణల పరంగా చూస్తే ఈ నియోజకవర్గంలో గత కొన్ని దశాబ్దాలుగా ప్రధాన పార్టీలు కమ్మ సామాజికవర్గానికే సీట్లు కేటాయిస్తుండగా ఆ సామాజికవర్గం వారే ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నారు. ఇక్క‌డ ఎమ్మెల్యేగా రెండు సార్లు చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ గెలిచారు. 2009-2014 లో ఆయ‌న రికార్డు విజ‌యం న‌మోదు చేసుకున్నారు. కానీ చింతమనేని పలు వివాదాల్లో చిక్కుకుని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా ఆవేశపరుడు అయిన చింతమనేనిని ఈ సారి నిలబెడితే గెలుస్తాడా అని చంద్రబాబు ఆరా తీస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి చూసుకుంటే ఈ మూడున్నర దశాబ్దాల్లో ఒక్క 1994లో కాంగ్రెస్‌ మినహా మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ ప్రధాన పార్టీలు ఇక్కడ కమ్మ సామాజికవర్గానికే సీట్లు కేటాయిస్తున్నాయి. ఇక దెందులూరులో గెలుపు గుర్రంగా ఈ సారి చింత‌మ‌నేని నిల‌బ‌డ‌తారా అనేది ఇప్పుడు ఆసక్తి కలిగించే అంశం. ముఖ్యంగా చంద్రబాబు కూడా ప్ర‌భాక‌ర్ విష‌యంలో దూకుడు నిర్ణ‌యాలు,ఆవేశం త‌గ్గించుకోవాలి అని చెప్పినా, ఐ డోంట్ కేర్ అనే టైపు చింతమనేని . ఆయ‌న ప‌ద్ద‌తిలో మార్పు రావ‌డం లేదు అనేది గుర్తించిన బాబు పునరాలోచనలో పడ్డారు.

ఇక్క‌డ నుంచి ఈసారి చింతమనేని ప్ర‌భాక‌ర్ కు విజ‌యం వ‌రిస్తుందా లేదా ఎవ‌రికి ఇక్క‌డ టికెట్ ఇవ్వాలి అనే ఆలోచ‌న కూడా బాబు మ‌దిలో ఉంది. అయితే వైసీపీ త‌ర‌పున అబ్బ‌య్య చౌద‌రిని జ‌గ‌న్ ప్రకటించేశారు. ఆయన్ని ఎదుర్కొని గెలిచే నాయకుడు ఎవరా అనేది బాబు శోధన . కుదిరితే మ‌రో అవ‌కాశం ప్ర‌భాక‌ర్ కు ఇవ్వ‌డం, లేక‌పోతే మాగంటి కుటుంబానికి ఇక్క‌డ అవ‌కాశం ఇవ్వటమో చెయ్యాలి. ఎందుకంటే ఇంక ఈ స‌మ‌యంలో కొత్త వారికి ఇక్కడ అవకాశం ఇస్తే చాలా సమస్యలు వస్తాయి కాబట్టి ఏలూరు ఎంపీ మాగంటి బాబు త‌న‌యుడు రాంజీకి అవ‌కాశం ఇవ్వాలా అనేది కూడా బాబు ఆలోచిస్తున్నారు. మరి బాబు చింతమనేనికి టికెట్ ఇస్తాడా లేకా షాక్ ఇస్తాడా అనేది మరి కొద్ది రోజుల్లో తేలనుంది. అయితే వీర ఆవేశపరుడైన చింతమనేని టికెట్ ఇవ్వకుంటే ఊరుకుంటాడా అని స్థానికంగా చర్చ జరుగుతుంది.

Related News