ఇప్పటి వరకు బుల్లితెర, వెండితరపై అలరించిన జబర్దస్త్ హాట్ బ్యూటీ రష్మీ తాజాగా తన దృష్టిని డిజిటల్ రంగంవైపు మళ్లించింది. ఇటీవల కాలంలో వెబ్‌సిరీస్‌లు యూత్‌కు బాగా కనెక్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ, బాలీవుడ్ భామ కియారా అద్వానీ వెబ్‌సిరీస్‌లతో బిజీగా ఉండగా, మరో జబర్దస్త్ భామ అనసూయ ఇప్పటికే ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
ఈ నేపథ్యంలో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా డిజిటల్ రంగాన్ని క్యాష్ చేసుకోవాలన్న తలంపుతో రష్మీ గౌతమ్ వెబ్‌సిరీస్‌లలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. తనను సంప్రదించిన ఏ ఫిల్మ్ బై అరవింద్ దర్శకుడు శేఖర్ సూరి కథకు రష్మీ ఓకే చెప్పేసింది. రష్మీ ప్రధాన పాత్రగా కొనసాగనున్న ఈ వెబ్‌సిరీస్‌లో నటుడు శ్రీకాంత్, సత్యదేవ్ నటించనున్నారు.
దర్శకుడు శేఖర్ సూరి చెప్పిన స్టోరీలో అడల్ట్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో రష్మీ తన రెమ్యునరేషన్‌ను అమాంతం పెంచేసిందట. రష్మీ అడిగినంద ఇచ్చేందుకు నిర్మాతలు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. గుంటూరు టాకీస్ చిత్రంతో యువతలో సెగలు రేపిన రష్మీ తాజాగా నటించనున్న వెబ్ సిరీస్‌తో సెగలు రేపడంతోపాటు పొగలు కూడా వస్తాయని, దర్శకుడు అటువంటి అడల్ట్ సన్నివేశాలను రాశాడని యూనిట్ చెబుతోంది.