పాకిస్థాన్ కు పట్టుబడిన భారత పైలట్ విక్రమ్ అభినందన్ స్వస్థలం తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా తిరుపణవూరు. చెన్నైలోని తాంబరంలో ఉన్న ఎయిర్‌ఫోర్స్ అకాడమిలో ఆయన కుటుంబం నివసిస్తోంది. విక్రమ్ అభినందన్ తండ్రి కూడా ఎయిర్ మార్షల్‌గా పనిచేసారు. ఉడుమలైపేటలోని సైనిక్ స్కూల్లో అభినందన్ విద్యాభ్యాసం సాగింది. మన దేశంపైకి దండెత్తి వచ్చిన శత్రు విమానాలను తరిమి కొట్టే ప్రయత్నంలో దాయాది దేశమైన పాకిస్థాన్ చెరలో పట్టుబడ్డాడు. భారత యుద్ధ విమానం మిగ్-21 తమ భూభాగంలో కూలినప్పుడు పారాచ్యూట్ సహాయంతో కిందకు దూకిన ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించింది పాక్ .
అభినందన్ గల్లంతైన విషయాన్ని భారత విదేశాంగ ధ్రువీకరించింది. అయితే ఆయన పేరును మాత్రం వెల్లడించలేదు.దౌత్యపరంగా పాకిస్థాన్‌పై ఒత్తిడి తీసుకొచ్చి అభినందన్‌ను విడిపించుకోవాలన్న ఆలోచనలో భారత్ ఉంది. ముందుగా ఈ విషయాన్ని..... పాకిస్థాన్ ప్రభుత్వమే ధ్రువీకరిస్తూ నోట్,వీడియో టేపులు రిలీజ్ చేసింది.పాకిస్థాన్ చేతికి చిక్కిన యుద్ధ ఖైదీలను శిక్షించొద్దన్న నిబంధనలు ఉల్లంఘించి మరి పాక్ సైనికులు అభినందన్‌పై దాడి చేసినట్లు తెలుస్తుంది.
భారత్ యెక్క రహస్యాలను చెప్పాలంటూ తనను అనేక రకాల చిత్ర హింసలకు గురి చేసినప్పటికీ ఆయన దేశ రహస్యాలను చెప్పానని కల కండీగా చెప్పిన వీడియో సందేశం కూడా చూడవచ్చు.ఇందులో భాగంగా ఢిల్లీలోని పాకిస్థాన్ డిప్యూటీ హైకమిషనర్ సయిద్ హైదర్‌ను పిలిపించుకుని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నిరసన వ్యక్తం చేసింది.పాకిస్థాన్ చేతికి చిక్కిన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ ఉదంతం ఒక్కటే కాదు.ఇలా గతంలోనూ అనేక సార్లు పట్టుబడిన మన వారిపై అనేక చిత్ర హింసలు గురిచేసింది. కార్గిల్ యుద్ధంలో పాక్‌కు పట్టుబడిన ఫ్లైట్ లెఫ్టినెంట్ కంభంపాటి నచికేతను గుర్తుకు తెస్తోంది. యుద్ధ ఖైదీలను శిక్షించొద్దన్న నిబంధనలు ఉల్లంఘించి పాక్ సైనికులు అభినందన్‌పై దాడి చేసినట్లుగానే.. ఆనాడు నచికేతను చిత్రహింసలకు గురిచేశారు.26 ఏళ్ల ఫ్లైట్ లెఫ్టినెంట్ కంభంపాటి నచికేతను కూడా ఈ విధంగానే అనేక చిత్రహింసలు చేసారు.