//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మృత్యువుతో పోరాటం చేస్తున్నప్రముఖ హీరో...శ్రీదేవి విషాదం మరువకముందే..

Category : movies

బాలీవుడ్ న‌టుడు ఇర్ఫాన్ ఖాన్ అరుదైన వ్యాధితో బాధ‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే.

అయితే ఇర్ఫాన్ ఆరోగ్యంపై ఆందోళన చెందిన మీడియా వాళ్ళు ఏదో ఒక నిర్ణయానికి వచ్చేసి వాటి ఆధారంగా కథనాలు రాస్తున్నారు దీంతో అలాంటి వార్తలు మరింత ఆందోళనకరంగా మారుతాయి అని స్వయంగా తానె రంగంలోకి దిగాడు ఇర్ఫ్హాన్.

ఇటీవ‌ల త‌న ట్విట్ట‌ర్‌ ద్వారా తనకి ఓ వ్యాధి సోకింద‌నే విష‌యం ప్రకటించిన ఇర్ఫాన్ ఈ వ్యాధి త‌న‌కు సోకుతుంద‌ని అస్స‌లు ఊహించ‌లేదు అని కాని ఏ మాత్రం అధైర్యప‌డ‌కుండా దానితో పోరాడుతూనే ఉంటాన‌ని తెలియ‌జేశాడు. ఇక త‌న ఆరోగ్యంకి సంబంధించి వ‌స్తున్న వార్త‌ల‌ని అస్స‌లు న‌మ్మొద్ద‌ని వారం ప‌దిరోజులలో ఆ వ్యాధి ఏంట‌ని నేనే చెబుతాన‌ని ఇర్ఫాన్ అన్నాడు.

ఇక తాజాగా ఇర్ఫాన్ భార్య సిక్‌ద‌ర్ త‌న భ‌ర్త ఆరోగ్యం గురించి మాట్లాడారు. త‌న భ‌ర్త ఓ యోధుడు. ఎలాంటి స‌మస్య‌నైన ఎదుర్కొనే ధైర్యం, స‌త్తా త‌న‌కి ఉంది అని తెలిపింది. కొద్ది రోజులుగా త‌న భ‌ర్త ఆరోగ్యం గురించి ఆందోళ‌న చెందుతున్న వారంద‌రు మెసేజ్, కాల్స్ చేశారు. వారికి స‌మాధానం ఇవ్వ‌నందుకు క్షమించాలి . త‌న భ‌ర్త ఆరోగ్యం గురించి పూజలు చేస్తున్న‌వారికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు.

ఇర్ఫాన్‌నే కాక న‌న్ను కూడా ఓ యోధుడిలా మార్చిన దేవుడికి రుణ‌ప‌డి ఉంటాను. ప్ర‌స్తుతం జీవిత‌మ‌నే ఓ యుద్ధ‌క్షేత్రంలో అడ్డు వ‌స్తున్న ప్ర‌మాదాల‌ని ఎలా ఎదుర్కోవాల‌నే దానిపై దృష్టి పెట్టాను. అభిమానులు కూడా ఇదే రీతిలో త‌మ జీవిత పోరాటంలో గెలిచేలా ప్ర‌య‌త్నించాలి అని తెలిపింది ఇర్ఫాన్ భార్య సుతాపా సిక్‌దర్. అయితే ఇప్పుడు అనూహ్యంగా ప్రస్తుతం ఇర్ఫాన్ ఆరోగ్య పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 6 నుంచి 12 నెలలకు మంచి బతకడం కష్టమే. ఆయన ఆరోగ్యం గురించి మనం భగవంతుడిని ప్రార్థించాలి అని ఉమర్ సంధూ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో శ్రీదేవి మరణవార్త నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న సినీలోకానికి ఇర్ఫాన్ వ్యాధి వార్త తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది.