యూకేలో ఒక ఔత్సాహిక ఆవిష్కర్త ఐరన్ మ్యాన్ సినిమాలో హీరో ధరించే సూట్ లాంటి సూట్ ను తయారుచేయడంలో సఫలీకృతుడయ్యాడు. దీని గొప్పతనం ఏమిటంటే ఇది ధరించిన వ్యక్తి కొంత ఎత్తులో గాలిలో తెలియాడేందుకు అనువుగా జెట్ ఇంజన్ అమర్చిన సూట్ సహకరిస్తుంది. మన శరీరంలో వున్న ఎముకలతో కూడిన అస్థిపంజరాన్ని ఎండో స్కెలిటన్ అంటారు. అలానే ఐరన్ మ్యాన్ సూట్ ను ఎక్సో స్కెలిటన్ అంటారు. ఎందుకంటే అది శరీరానికి సపోర్ట్ ఇచ్చే ఫ్రేమ్ తో దేహానికి వెలుపల ఉటుంది కనుక ఈ సూట్ లో చేతులకు, నడుముకు కలిసి మూడు సెట్ల జెట్ ఇంజన్లుంటాయి. రిఛార్డ్ బ్రౌనింగ్ అనే 38 సంవత్సరాల ఆయిల్ వ్యాపారస్తుడు తన గ్యారేజ్ లో ఈ ఆవిష్కరణను చేశారు. అక్కడే సరిపోయినన్ని జెట్ లు ఉంటే ఎగరడం సులువు అని కనుగొన్నాడు. గైరోలు, కంప్యూటర్లు ఉపయోగించి గాలిలో స్థిరంగా నిలిచి ఉండేట్లుగా డిజైన్ చేశాడు. కాకపోతే దీనిని ఉపయోగించి ఎగరాలంటే కొంచెం శ్రమతో కూడుకున్న పని. ఓ మోస్తారు భారీగా అనిపించే ఆరు జట్ల ఇంజెన్లు మోయటం అందరికి కాదు. దీనిని ఒకే దిశలో నడిపేందుకు స్టీరింగులా ఏమిలేదు. రెండు చేతులకు అమర్చిన చిన్న ట్రిగ్గర్ల ద్వారా ఎగరడం సులువౌతుంది. గ్రీకు పురాణగాధల్లోని 'డేడాలస్' తనకు స్ఫూర్తి అని తెలిపాడు. డేడాలస్ రెక్కలు చేసుకొని ఎగరటానికి ప్రయత్నిస్తాడు. ప్రస్తుతం ఇది ఆరంభం మాత్రమే ముందు ముందు ఎగిరే ఎక్సోస్కెలిటన్ ను ఇంకా బాగా అభివృద్ధి చేస్తే కొన్న కొద్దిమందికి ట్రాఫిక్ సమస్య ఉండకపోవచ్చు. కీలుగుర్రం సినిమాలో అక్కినేనిలా ఆకాశయానం చేయవచ్చు.