చారిత్రాత్మక మోసుల్ మసీదును గురువారం ఇరాక్ ప్రభుత్వ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మూడేండ్ల నుంచి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ మసీదును తమ (కాలిఫేట్) రాజ్యంగా మార్చుకున్నదని ఇరాకీ సైన్యం తెలిపింది. ఎనిమిది నెలలకుపైగా పోరాడి ఇస్లామిక్‌స్టేట్ ఆధీనంలో ఉన్న 850 ఏండ్లనాటి గ్రాండ్ అల్-నూరి మసీదును స్వాధీనం చేసుకోవడం ఐఎస్‌పై విజయంగా భద్రతాదళాలు పేర్కొంటున్నాయి. మోసుల్‌ను తమ రాజధానిగా మార్చుకుని ఐస్లామిక్స్టేట్ పనిచేసింది. ఈ దెబ్బతో ఐఎస్ కల్పితరాజ్యం నేలకూలిందని ఇరాక్ సైన్యం అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యాహ్య రసూల్ తెలిపారు. మధ్యయుగం నాటి మసీదు, దాని స్తంభాలను తిరుగుబాటుదారులు వారం కిందటే కూల్చివేశారు.