//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఐపీఎల్ వేలంలో హీరోలు...ఆట‌లో జీరోలు

Category : sports

ఒక్కొక్క‌రిని కోట్లు పెట్టి కొన్నారు. వారిపై సెల‌క్ట‌ర్లు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు.ఐపిఎల్ 11వ సిజ‌న్ స‌గం వ‌ర‌కూ ముగిసంది అయినా వాళ్లు ఎటువంటి ప్ర‌తిభ క‌న‌బ‌ర్చ‌డం లేదు. వాళ్ల ఆట చూస్తేంటే ప్రేక్ష‌కుల‌కే విసుగు వ‌స్తుంది. అయితే ఇపుడు ఆ జ‌ట్లు ఓడిపోవ‌డానికి కార‌ణం కూడా ఆ ప్లేయ‌ర్లే. కోట్టు పెట్టి కొన్న ప్లేయ‌ర్లు బాగా ఆడ‌తార‌నుకుంటే ప్ర‌తి మ్యాచ్ లోనూ నిరాశగానే వెనుదిరుగుతున్నారు. మ్యాచ్ ను విజ‌యం దిశ‌గా మ‌లుపుతార‌నున్న ఆ ప్లేయ‌ర్లు క‌నీసం ప‌రుగులు కూడా చేయ‌డం లేదు. ఈ ప్లేయ‌ర్ల వ‌ల్ల ఆ జ‌ట్లు భారీగా దెబ్బ‌తింటున్నాయి. కోట్లు పెట్టి కొన్న ఆట‌గాళ్లు..ఆ జీరో వీరులు ఎవ‌రో చూద్దాం..

కిర‌న్ పోలార్డ్ ఇత‌ను వెస్ట్ ఇండిస్ టీం మేన్ ప్లేయ‌ర్. ఇత‌ను ఐపిఎల్ లో ప్ర‌తిసారి ముంబై టీం ఇత‌ని మీద ఎన్నో ఆశ‌లు పెట్టుకుని త‌మ టీం లోకి తీసుకుంటుంది. టీ20సీరిస్ లు వెస్ట్ ఇండిస్ ప్లేయ‌ర్ల‌కు వెన్నెతో పెట్టిన విద్య‌. అందుకే ప‌రుగుల విరులుగా వీరికి మంచి పేరుంది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఐపిఎల్ 11వ సిజ‌న్ లో పోలార్డ్ ను రూ. 5.40కోట్ల‌కు ద‌క్కించుకుంది ముంబై . ముంబై ఇండియ‌న్స్ లో పోలార్డ్ కీల‌క ఆట‌గాడు కూడా. ఇంత వ‌ర‌కూ ముంబై ఆడిన 7 మ్యాచ్ ల‌లో 76 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. అంతేకాదు ఇత‌ని ఆల్ రౌండ్ ప్లేయ‌ర్ గా కూడా తీసుకున్నారు. కానీ ఈ సీజ‌న్ లో ఇత‌నికి ఒక్క ఓవ‌ర్ బౌలింగ్ కూడా ఇవ్వ‌లేదు. దినికి తోడు ఈ సిజన్ లో ముంబై వ‌రుస‌గా మ్యాచ్ లు ఓడిపోవ‌డంతో పోలార్డ్ పై ముంబై యాజ‌మాన్యం గుర్రుగా ఉందంట‌. ఈ సిజ‌న్ లో పోలార్డ్ పూర్తిగా ఫామ్ లో లేక‌పోవ‌డంతో ముంబైకి త‌ల‌నొప్పిగా మారాడు.

ఇక మ‌రో ప్లేయ‌ర్ డీఆర్సీ షార్ట్ ఇత‌నిది ఆస్ట్రేలియా. బిగ్ బాస్ లీగ్ లో ప‌రుగుల వ‌ర్షం కురిపించిన టీ 20 స్పెష‌లిస్ట్ గా ఇత‌నికి పేరుంది. బిగ్ బాష్ లీగ్ ప్ర‌ద‌ర్శ‌న‌తోనే ఆస్ట్రేలియా టీ20టీంలో చోటు సాంపాదించుకున్నాడు. దింతో మ‌నోడి ధ‌ర ఒకే సారి అమాంతం పెరిగిపోయింది. దింతో ఈ సిజ‌న్ లో రాజ‌స్దాన్ రాయ‌ల్స్ అత‌డిని ఏకంగా రూ.4కోట్లు పెట్టి తీసుకుంది. కానీ టీ20లో ఆడిన ఆట‌లో స‌గం ప్ర‌ద‌ర్శ‌న కూడా ఐపిఎల్ లో చేయ‌డం లేదు. ఇంత‌వ‌ర‌కూ ఆయ‌న 5మ్యాచ్ లు ఆడితే మొత్తం 109ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. ఇత‌ను ఇంత ఘోరంగా విఫ‌లం చెంద‌డంతో రాజ‌స్ధాన్ టీం తీవ్ర నిరాశ‌లో ఉంది.

ఇక మ‌రో ఆట‌గాడు గ్లేన్ మ్యాక్స్ వెల్. సింగిల్ హ్యాండ్ తో ఆట‌ను మ‌లుపు తిప్ప‌గ‌ల స‌మ‌ర్దుడు ఇత‌డు. ఆస్ట్రేలియా టీం లో ఆల్ రౌండర్. గ‌తంలో పంజాబ్ టీం లో ఆడిన ఇత‌డిని....ఈ ఐపిఎల్ లో ఢిల్లి డేర్ డెవిల్స్ ఇత‌డిని తీసుకుంది. మ్యాక్స్ వెల్ రాక‌తో ఢిల్లిలో కొంత హుషారు వ‌చ్చిందంనుకుంటే మ‌నోడు తీవ్ర నిరాశ‌ను చూపుతున్నాడు. ఐపిఎల్ లో అత్య‌ధిక విధ్వంస‌క‌ర ఆట‌గాళ్ల‌లో మ్యాక్స్ వెల్ కూడా ఒక‌రు. ఇప్ప‌టివ‌ర‌కూ ఢిల్లి టీంలో ఆడిన 8మ్యాచ్ ల‌లో కేవ‌లం 131ప‌రుగులే చేయ‌డం విశేషం. అటు బ్యాటింగ్ మాత్ర‌మే విఫ‌లం చెందాడు అనుకుంటే పోర‌పాటే...బౌలింగ్ కూడా పూర్తిగా ఫేల్ అయ్యాడు. ఇత‌డి ఆట ఢిల్లి విజ‌యావ‌కాశాల‌ను దెబ్బ‌తీస్తుంది. ఢిల్లి యాజ‌మాన్యం ఇత‌నిని రూ.9కోట్లుకు ద‌క్కించుకుంది.

ఇక జ‌య్ దేవ్ ఉనాద్క‌ట్ భార‌త్ బౌలింగ్ మంచి పేస‌ర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. టీ20లో మంచి ప్ర‌తిభ‌ను క‌న‌బ‌ర్చ‌డంతో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ అత‌నిని రూ.11.5కోట్ల పెట్టి ఇత‌నిని తీసుకుంది. గ‌త ఐపిఎల్ లో అద‌గొట్టే బౌలింగ్ వేయ‌డంతో ఈ యువ పేస‌ర్ ను ఇంత ధ‌ర పెట్టి కొనుక్కుంది రాజ‌స్ధాన్ రాయ‌ల్స్ .గ‌త ఐపిఎల్ లో ఆడిన 12మ్య‌చ్ ల్లో 24వికెట్లు తీశాడు. ఈసారి మాత్రం 8మ్య‌చ్ ల్లో 7వికెట్లు మాత్ర‌మే తీశాడు. ఈయ‌న బౌలింగ్ తో చాలా సార్లు జ‌ట్టు ఓట‌మిపాల‌య్యింది.

ఇక‌ మ‌రో ఆట‌గాడు ఆరోన్ ఫించ్. టీ20లో ఆసిన్ త‌ర‌పున ఓపెన‌ర్ ఆట‌గాడు. టీ20లో ఇత‌డి ఆట చూసి మురిసిపోయిన పంజాబ్ ఇత‌నిని ఏకంగా రూ.6.2కోట్లు పెట్టి తీసుకుంది. ఈ సిజన్ లో ఆడిన రెండు మ్యాచ్ ల‌లోనూ డ‌క్ అవుట్ అయి పెవిలియ‌న్ కు చేరాడు. ఇత‌డిపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న పంజాబ్ టీంను ఇత‌డు న‌ట్టేట ముంచేస్తున్నాడు. ప్ర‌తి మ్యాచ్ లోనూ సింగిల్ డిజిట్ కే పరిమిత‌మయ్యాడు. ఫించ్ ఆట ప్ర‌భావం టీం మొత్తం మీద ప‌డుతుంది. ఈ సిజ‌న్ లో ఇత‌డు ఆడిన 6మ్యాచ్ ల‌లో కేవ‌లం 24 ర‌న్స్ మాత్ర‌మే చేయ‌గ‌లిగాడు. కోట్లు పెట్టి కొన్న ఆట‌గాళ్లు ఇలాంటి ప్ర‌ద‌ర్శ‌న చూపిస్తుండ‌టంతో్ టీం కు నిరాశే ఎదుర‌వుతుంది.