//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కోహ్లి సేనకు కలిసి వస్తుందా..?

Category : sports

టీం ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లికి జీవితంలో ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఐపియల్ జట్టు విషయంలోనే ఎంతో ప్రతిభ కలిగిన ఆటగాళ్ళు జట్టులో ఉన్నా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఇప్పటి వరకు ఒక్క ఐపియల్ టోర్నీలో కూడా విజేతగా నిలువలేకపోయింది.

మూడు సార్లు ఫైనల్ మొహం చూసినా ఒక్కసారి కూడా కప్ అందుకోలేకపోయింది. ఈ ఏడాది భారి అంచలనాలతో బరిలోకి దిగుతున్న ఈ జట్టు ఇప్పుడైనా కప్ కొత్తకపోతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. గత సీజన్లలో ఆశించిన మేరకు రాణించలేకపోయిన వెస్టిండీస్‌ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్‌ను వదిలించుకున్న బెంగళూరు కెప్టెన్‌ కోహ్లీ, డివిల్లీర్స్‌తోపాటు దేశవాళీ ప్లేయర్‌ సర్ఫ్‌రాజ్‌ను కూడా అట్టిపెట్టుకుంది.

బౌలింగ్‌ విభాగంతోపాటు ఆల్‌రౌండర్ల ఎంపికలోనూ ఎంతో జాగ్రత్తగా వ్యవహరించి బలమైన జట్టును ఎంపిక చేసుకుంది. కాని సెంటిమెంట్ మాత్రం ఆ జట్టులో వణుకు పుట్టిస్తుంది. స్టార్ ఆటగాళ్ళు ఉన్నా దురదృష్టం వెంటాడుతుండ౦ ఆ జట్టు యాజమాన్యానికి మింగుడు పడటం లేదు. మరి ఈ టోర్నీ లో అయినా కప్ అందుకుంటుందో లేదో చూడాలి.