//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పైసా వసూల్ మ్యాచ్.. ఐపీఎల్ మైండ్‌బ్లోయింగ్ ఫ‌స్ట్ మ్యాచ్‌..!

Category : sports

ఐపీఎల్ తాజా సీజన్ ఆరంభం అదిరింది. ముంబై వాంఖడే వేదికగా శనివారం రాత్రి జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై ఒక వికెట్ తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించి అభిమానుల‌కు ట్వంటీ ట్వంటీ మజాను రుచి చూపించింది. 166 పరుగుల లక్ష్య ఛేదనలో హిట్టర్ డ్వేన్ బ్రావో (68: 30 బంతుల్లో 3x4, 7x6) సంచలన ఇన్నింగ్స్‌తో చెన్నైని విజయతీరాలకి చేర్చగా.. చివర్లో కేదార్ జాదవ్ (24 నాటౌట్: 22 బంతుల్లో 1x4, 2x6) లాంఛనాన్ని పూర్తి చేశాడు.

అంతకుముందు ముంబయి బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు విసురుతుండటంతో చెన్నై ఓటమి దాదాపు ఖాయం అనుకున్నారంతా.. ఈ క్రమంలో 105పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి చెన్నై పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ముంబయి ఇండియన్స్‌ ఆశలను అడియాసలు చేస్తూ చెన్నై ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో 68(30) చెలరేగి ఆడి చెన్నైను దాదాపు విజయతీరాలకు చేర్చాడు. 24 బంతుల్లో 51 పరుగులు చేయాల్సిన దశలో గేర్ మార్చిన బ్రావో.. మెక్లనగాన్, బుమ్రా బౌలింగ్‌లో వరుస సిక్సర్లతో విరుచుకుపడి ఆట గమనాన్నే మార్చేశాడు. జట్టు స్కోరు 159 వద్ద బ్రావో ఔటవగా.. మ్యాచ్ ఉత్కంఠ తారాస్థాయికి చేరింది.అయితే రిటెర్డ్‌హర్ట్‌గా క్రీజు వదిలి వెళ్లిన కేదార్‌ జాదవ్‌ మళ్లీ 19ఓవర్‌లో బ్యాటింగ్‌కు వ‌చ్చిని జాద‌వ్‌.. మొద‌టి మూడు బంతులు వృదా చేయ‌డంతో ప్రేక్ష‌కుల్లో తీవ్ర‌మైన టెన్సన్ నెల‌కొన‌గా.. ఆ త‌ర్వాత వ‌రుస‌గా సిక్స్, ఫోర్ కొట్టి చెన్నైసూప‌ర్ కింగ్స్‌ విజయం ఖాయం చేశాడు. దీంతో మొత్తంమ్మీద ఐపీఎల్ మొదటి మ్యాచే పైసా వసూల్ అనిపించింది.

Related News