2018 ఐపీఎల్ సీజన్ చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే రెందు బెర్తులు ఖాయం కాగా.. మరో రెండు బెర్తుల కోసం.. నాలుగు జట్లు పోరాడుతున్నాయి. ఇక నెలన్నర నుండి దేశమంతా ఐపీఎల్ ఫీవర్‌తో ఊగిపోతుంటే.. ఒక్కవారంలో సీన్ మారిపోయింది. ఇప్పుడు దేశమంతా ఐపీఎల్ కంటే ఎక్కువగా కన్నడ రాజకీయాల పై దృష్టిపెట్టారు.
కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల డేట్ ప్రకటించినప్పటి నుండి.. మొదలైన ఉత్కంఠం.. రోజురోజుకీ మలుపులు తిరుగుతూ.. ఎన్నికల ఫలితాలు విడుదల అయినా కూడా అక్కడ సస్పెన్స్ మాత్రం వీడలేదు. దీంతో క్షణక్షణానికి మలుపులు తిరుగుతున్న కన్నడ రాజకీయాలు దేశవాసులను తిరిగి న్యూస్ ఛానెల్స్ పత్రికలూ, వెబ్ పోర్టల్స్ వైపు దృష్టి పెట్టేలా చేశాయి.
దీంతో ఐపీఎల్ మ్యాచ్‌ల్లో లేని మజా కన్నడ పాలిటిక్స్‌లో కనపడటమే ప్రేక్షకుల ట్రెండ్ మారిపోవడానికి కారణం అంటున్నారు విశ్లేషకులు. కర్ణాటక ఎన్నికల పోలింగ్ నుంచి కౌంటింగ్ ఆ తరువాత ప్రభుత్వ ఏర్పాటు అంశం ఆ వెంటనే కాంగ్రెస్ సుప్రీం కోర్ట్‌ను ఆశ్రయించడంతో వేసవి తాపాన్ని మించి మరి కన్నడ రాజకీయాలు హాట్ హాట్‌గా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అంతా ఇప్పుడు బుర్ర అటునుంచి ఇటు తిప్పారు. దాంతో టీవీ ఛానెల్స్ రేటింగ్ అమాంతం పెరిగితే ఐపీఎల్ రేటింగ్స్‌కి మాత్రం పెద్ద దెబ్బే పడిందని సర్వత్రా చర్చించుకుంటున్నారు.