//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

యువ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు ...ధోని సూచనలు చాలా సార్లు తప్పయ్యాయి

Category : sports

మహేంద్ర సింగ్ ధోని.. వికెట్ల వెనుక ఎంత సమయస్ఫూర్తితో వ్యవహరిస్తుంటాడో అందరికీ తెలిసిందే. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ కదలికలకు అనుగుణంగా బౌలర్ల మార్పు, ఫీల్డింగ్ కూర్పులు చేస్తూ ముప్పుతిప్పలు పెడతాడు. తన మెదడులో నిక్షిప్తమైన అస్త్రాలను అవసరానికి తగ్గట్లు బయటపెట్టి, బౌలర్లకు విలువైన సూచనలు ఇస్తుంటాడు. డీఆర్‌ఎస్‌లోనైతే ధోనికి తిరుగేలేదు. డీఆర్ఎస్ అంటే డెసిషన్ రివ్యూ సిస్టం.. కానీ, అభిమానులు దాన్ని ధోని రివ్యూ సిస్టంగా మార్చేశారు. అయితే, ధోని కూడా మనిషే. తప్పులు చేయడం సాధారణం. అయితే, ధోని ఇచ్చే సూచనలు చాలా సార్లు తప్పయ్యాయని సంచలన వ్యాఖ్యలు చేశాడో క్రికెటర్. అతడే.. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్.

‘బౌలింగ్ చేసే సమయంలో ధోని సూచనలు ఇస్తుంటాడు కదా.. అతడి సూచనలను ఎప్పుడైనా ప్రశ్నించావా?’ అని అడగ్గా.. చాలాసార్లు ధోని ఇచ్చిన సూచనలు చాలా సందర్భాల్లో తప్పయ్యాయని, కానీ ఆ విషయం ఆయనకు చెప్పలేమని తెలిపాడు. అయితే, ధోని ఎక్కువగా మాట్లాడడని, ఓవర్ల మధ్యలో మాత్రమే మాట్లాడతాడని, అదీ.. అవసరమైతేనేనని వెల్లడించాడు. ధోని ద్వారా తాను చాలా నేర్చుకున్నానని, ఆయన అనుభవం కుర్రాళ్లకు ఎంతో ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించాడు. కాగా, ధోని కెప్టెన్సీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో విశాఖపట్నం వేదికగా గత శుక్రవారం సీఎస్‌కే రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌ జరిగింది. ఆ మ్యాచ్‌లో అక్షర్ పటేల్ అప్పర్ కట్ షాట్‌కు యత్నించాడు. మరోసారి అలాగే చేస్తాడని ఊహించిన ధోని..

ఓ అద్భుతం చేశారు.అదేంటంటే.. సాధారణంగా డ్వేన్ బ్రావో స్లో బంతులు విసురుతుంటాడు. దీంతో అక్షర్ పటేల్ అప్పర్ కట్‌ తప్పకుండా ప్రయత్నిస్తాడని ఊహించిన ధోని గాలి గమనంపై అవగాహన కోసం చిటికెడు మట్టి తీసుకుని గాల్లో వదిలాడు. అనంతరం తాహిర్‌ని ముందే హెచ్చరించి ‘నీకు క్యాచ్ రాబోతుంది’ అంటూ హెచ్చరిక సంకేతాలు ఇచ్చాడు. ఆ తర్వాత బంతికే బ్రావో బౌలింగ్‌లో అక్షర్‌ పటేల్ డీప్ ఫైన్‌లెగ్‌లో ఉన్న తాహిర్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.