ఐపీఎల్ 2018 వేలానికి రంగం సిద్ధమైంది. నేడు జరుగనున్న వేలంలో 578 ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు అయితే వీరిలో ముందుగా 16 మంది మార్కూ ఆటగాళ్లను వేలంలో ప్రవేశపెడుతారు ఈ 16 మంది కనీస ధర రూ.2కోట్లు ఉండగాఆయా ఫ్రాంచైజీలు తమకు నచ్చితే ఎన్ని కోైట్లెనా కుమ్మరించేందుకు సిద్ధంగా ఉండటంతో ఆ జాక్‌పాట్ ఎవరికి తగులుతుందనేదే ఆసక్తికరంగా మారింది.
మార్క్యూ ఆటగాళ్లలో సిక్సర్ల వీరుడు యువరాజ్‌సింగ్, గంభీర్, ధవన్, రహానే రేసులో ఉన్నారు. గంభీర్‌ను కోల్‌కతా దక్కించుకుంటుందా లేక ఢిల్లీ మొగ్గు చూపుతుందా అనేది ఆసక్తికరంగా మారింది ఇక ధవన్‌ను సన్‌రైజర్స్ రైట్ టు మ్యాచ్ ద్వారా తీసుకునే అవకాశాలూ ఉన్నాయి. రహానేపై అతని పాత ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ ఆసక్తితో ఉన్నట్టు తెలుస్తున్నది.
అయితే యువీ విషయంలోనే కాస్త సందిగ్ధం నెలకొంది. తాజాగా జరిగిన ముస్తాక్ అలీ టీ20లో అంచనాలను అందుకోలేకపోవడంతో ఇతడిని దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు భారీ ధరను వెచ్చించకపోవచ్చు. అయితే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యువీపై ఆసక్తికనబరుస్తున్నది ఇదే జాబితాలో ఉన్న హర్భజన్ సింగ్‌ను ముంబై మళ్లీ తీసుకునే ఆలోచనలో ఉంది.