Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఐపీఎల్-10 ఎవరిది?

Category : sports

ఐపీఎల్ మహా సంగ్రామం తుది సమరానికి సిద్ధమవుతోంది. ఎనిమిది జట్లు ...55 మ్యాచ్ లు ..44 రోజులపాటు అలరించిన ఐపీఎల్-10 విజేతలెవరో మరో కొన్ని గంటలలో తేలిపోనుంది. మూడోసారి ఛాంపియన్స్ గా అవతరించాలని ముంబయి బావిస్తోంటే .... ఈ సీజన్ తో ముగిసిపోనున్న పుణె, ఛాంపియన్ గా నిలిచి తన ప్రస్థానాన్ని చాటాలని భావిస్తోంది.

మూడోసారి ముద్దాడేనా ?

రెండు సార్లు ఛాంపియన్స్ గా నిలిచినా ముంబయి మూడోసారి కూడా టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఉన్నది. ఈ సీజన్ లో మూడుసార్లు పుణె పై ఓడిన ముంబయి ఫైనల్ లో ప్రతీకారం తీర్చుకోవాలి భావిస్తోంది. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ ఇలా అన్ని విభాగాల్లో బలంగా ఉన్న ముంబయి సమిష్టిగా ఆడితే విజేతలుగా నిలువడం తథ్యం. కెప్టెన్ రోహిత్ శర్మ జట్టులో స్ఫూర్తి నింపడంలో విజయం సాధిస్తున్నాడు. జట్టుకు అవసరమైన సమయంలో విలువైన ఇనింగ్స్ ఆడటమే కాకుండా ... కెప్టెన్ గా తన మార్క్ చూపిస్తున్నాడు. ఇక జట్టులో పార్థివ్, సిమన్స్‌ లాంటి అనుభవం గల ఓపెనర్లు ...పొలార్డ్‌, కృనాల్‌, హార్దిక్‌ పాండ్యలతో కూడిన మిడిలార్డర్‌.. మెక్లెనగన్‌, మిచెల్‌ జాన్సన్‌, కర్ణ్‌శర్మ, బుమ్రా, మలింగల బౌలింగ్‌ దాడితో ముంబయి పటిష్టంగా ఉంది. కలిసి కట్టుగా ఆడితే ముంబయి కచ్చితంగా విజయం సాధిస్తుంది.

పుణె మెరిసేనా ?

ఆరంభంలో తడబడిన ... పుంజుకొని స్థిరమైన ఆటతో ఫైనల్ చేరింది పుణె. జట్టులో ధోని, స్మిత్ లాంటి అంతర్జాతీయ కెప్టెన్స్ ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. ముఖ్యంగా ధోనీ...అతడికి ఇది ఏడో ఫైనల్ మ్యాచ్. అపార అనుభవం కలిగిన ధోనీ.. పుణె ఛాంపియన్ గా నిలిచేందుకు దోహదపడతాడు అనడంలో సందేహంలేదు. పుణె ఛాంపియన్ కావాలంటే, ఆరంభంలో రహానె, త్రిపాఠి.. మిడిలార్డర్‌లో స్మిత్‌, ధోనీ, మనోజ్‌ తివారి.. బౌలింగ్‌లో ఉనద్కత్‌, శార్దూల్‌, సుందర్‌లు రాణించడం పుణెకు అత్యంత కీలకం.