ఐపీఎల్ -11 సీజన్ రసవత్త స్థాయికి చేరుకుంది. ఈ ఐపీఎల్ సీజన్లో చెన్నూసూపర్ కింగ్స్ మరోసారి బెంగుళూరును చిత్తు చేసింది. ప్లేఆఫ్ బరిలో నిలవాలంటే గెలవాల్సిన తప్పనిసరి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బోల్తా పడింది. దాదాపు అభిమానులను ఆశలను ఆవిరి చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. 128 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఇంకా 12 బంతులు ఉండాగానే ధోనీసేన ఛేదించింది.
బ్యాటింగ్‌కు మారుపేరైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును చెన్నై స్పిన్నర్లు ముప్పు తిప్పలు పెట్టారు. గింగిరాలు తిరిగే బంతులతో కీలక బ్యాట్స్‌మెన్‌ను స్వల్ప స్కోర్లకే పెవిలియన్ బాట పట్టించారు. దింతో కేవలం 127 పరుగుల మాత్రమే చేశారు. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఇంకా రెండు ఓవర్లు మిగిలివుండగానే ధోని సేన ఫినిష్ చేసింది. ఈ ఓటమితో ఐపీఎల్లో విరాట్ సేన పోరు ముగిసినట్లేనని... ఇంకా ఆ జట్టుకు అవకాశాలు దాదాపు అంతరించుకుపోయాయని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.